Sunday, 30 May 2021

మత్తెక్కిస్తోన్న చిట్టి.. వయ్యారాలతో ఫరియా వల

జాతి రత్నాలు బ్యూటీ సోషల్ మీడియాలో ప్రస్తుతం దూసుకుపోతోన్నారు. ఒక్క సినిమాతో ఈ బ్యూటీ ఫేట్ మారిపోయింది. అంతకు ముందు కూడా సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంలో దూసుకుపోయారు. అయితే జాతిరత్నాలు సినిమాతో సిల్వర్ స్క్రీన్ మీద మెరిశారు. అలా చిట్టి పాత్రతో తెలుగు ప్రేక్షకులకు ఫరియా దగ్గరయ్యారు. చిట్టి నీ నవ్వంటే అంటూ కుర్రకారు ఫిదా అయ్యారు. ఇక ఫరియా నెట్టింట్లో చేసే అల్లరి గురించి అందరికీ తెలిసిందే. మొన్నటికి మొన్న తన బర్త్ డే అంటూ సోషల్ మీడియాలో విషెస్ వెల్లువెత్తాయి. అవన్నీ చూసుకుంటూ నవ్వేసిన ఫరియా చివర్లో అసలు విషయం చెప్పేశారు. తన బర్త్ డే కాదని ఎవరో తప్పుడు సమాచారం ఇచ్చారని ఫరియా చెప్పుకొచ్చారు. అయినా సరే తనకు విషెస్ చెప్పినందుకు అందరికీ థ్యాంక్స్ అని అన్నారు. ఇక తాజాగా ఫరియా ఓ వీడియోను రిలీజ్ చేశారు. మనోహర అనే పాటకు (హిందీ వర్షెన్) ఫరియా మత్తెక్కించేలా డ్యాన్స్ చేశారు. తన వయ్యారాలను తిప్పుతూ నెటిజన్లను కట్టిపడేశారు. ఈ పాట చూడాలంటే సమయం, ఓపిక రెండూ ఉండాలని అన్నారు. ఈ పాటను ఎన్నో సార్లు విన్నాను. కానీ ఈ అనుభూతి ఎప్పుడూ రాలేదంటూ తన డ్యాన్స్ గురించి, తన మూమెంట్స్ గురించి చెప్పుకొచ్చారు. పాటకు తగ్గట్టు, రిథమ్‌కు తగ్గట్టుగా మూమెంట్స్ వేయడం బ్యాలెన్స్ నేర్చుకుంటున్నాను అని ఫరియా అన్నారు. మొత్తానికి ఈ చిట్టి మాత్రం నెట్టింట్లో తన స్టెప్పులతో అందరి గుండెలను కొల్లగొట్టేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vFjgGI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....