సినీ పరిశ్రమలో కరోనా తీవ్ర విషాదాన్ని రేపుతోంది. వరుసగా సెలెబ్రిటీలు మృత్యువాత పడుతున్నారు. కరోనాతో సినీ ప్రముఖులు మరణించడం తీవ్ర దిగ్బ్రాంతిని కలగజేస్తోంది. తాజాగా నటుడు, నిర్మాత అయిన కరోనాతో మృతి చెందారు. శుక్రవారం అర్దరాత్రి దాటాక పరిస్థితి విషమించడంతో ఆయన తుది శ్వాస విడిచారు. ఇక ఆయన మరణంపై కోలీవుడ్ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తున్నారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని పోస్ట్‌లు పెడుతున్నారు. వెంకట్ సుభాకు కరోనా సోకడంతో చెన్నైలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంటున్నారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆయన్ను ఐసీయూలో పెట్టి చికిత్స అందించారు. అయితే నిన్న అర్దరాత్రి దాటాక ఆయన మరణించారు. ఆయన మృతిపై రాధికా శరత్ కుమార్, ప్రకాష్ రాజ్, వంటి వారంతా స్పందించారు. ‘వెంకట్ సర్ ఇది నమ్మశక్యంగా లేదు.. ఉదయనిధి సినిమా షూటింగ్ నుంచి వచ్చారు.. తెల్లారే జ్వరం వచ్చింది.. కానీ పాజిటివ్ రాలేదు.. ఆ తరువాత కొన్ని రోజులకు మళ్లీ అనారోగ్యం పాలయ్యారు.. ఇప్పుడు ఆయన మరణించారు.. ఆయనింకా వ్యాక్సిన్ కూడా వేసుకోలేదు.. సారీ సుభా’ అంటూ కస్తూరీ చేసిన వ్యాఖ్యలపై నెటిజన్లు భగ్గుమంటున్నారు. అయితే ఇదంతా డీఏంకే వల్ల అయిందంటావా? వ్యాక్సిన్ వేసుకోకపోవడం వల్లే మరణించారంటావా? అని ప్రశ్నిస్తున్నారు. వెంకట్ సుభా మరణంపై రాధిక స్పందిస్తూ.. ‘మీకు వీడ్కోలు చెప్పేందుకు ఎంతో బాధగా ఉంది.. రాడాన్ సంస్థలో ఆయన భార్య నాతో ఎప్పటి నుంచో కలిసి పని చేస్తున్నారు.. వెంకట్ ఎంతో మంచి వారు.. ఆయన గత కొన్నేళ్ల నుంచి నాకు తెలుసు.. సుభా ఆయన ప్రాణాలు కాపాడటం కోసం ఎంతగానో ప్రయత్నించారు.. ఆయన మరణించడంతో నా గుండె ముక్కలైనట్టు అనిపిస్తోంద’ని అన్నారు. ప్రకాష్ రాజ్ స్పందిస్తూ.. ‘ఎంతో బాధగా ఉంది.. ఇలా ఒక్కొక్కరిగా ఫ్యామిలీ, ఫ్రెండ్స్‌ను కోల్పోవడం తట్టుకోలేకపోతోన్నాను.. నిస్సహాయుడిగా మిగిలిపోయాను. వారు జ్ఞాపకాలతో నా జీవితం ఎంతో భారంగా మారుతోంది.. నా ఈ జీవితప్రయాణంలో భాగస్వామివి అయినందుకు ధన్యవాదాలు.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. నీ ఆత్మకు శాంతి కలగాల’ని కోరుకున్నారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2R0NTqW
No comments:
Post a Comment