Sunday, 30 May 2021

మహానటిలో ఈ కళ కూడా ఉందే.. అదరగొట్టేసిన కీర్తి సురేష్

వంట చేయడం అనేది ఓ కళ అంటుంటారు. ఇష్టమైన ఆహార పదార్థాలు, వెరైటీ పదార్థాలను ఇష్టంగా వండుకుని తినే తీరిక ఎక్కువగా ఉండదు. అలాంటి అవకాశాలు కూడా అంతగా రావు. మరీ ముఖ్యంగా సెలెబ్రిటీల జీవితాల్లో అలాంటి క్షణాలు చాలా తక్కువగా ఉంటాయి. కానీ కరోనా, లాక్డౌన్ పుణ్యమా అని వారు కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఇక కొందరు హీరోలు, హీరోయిన్లు వంట గదిలోకి దూరిపోయి కొత్త రకాలను వండేస్తున్నారు. తాజాగా కూడా రంగంలోకి దిగారు. తన చేతి వాటాన్ని చూపించారు. పాకశాస్త్రంలో తానెంత నిపుణురాలో అందరికీ చూపించారు. వెండితెర మీదే కాదు.. వంటగదిలోనూ తానే మేటి అని చూపించుకున్నారు. తనకెంతో ఇష్టమైన రెసిపీని వండారు. ఈ మేరకు ఆమె వదిలిన వీడియో నెట్టింట్లో వైరల్ అవుతోంది. భోజన ప్రియులు ఈ వీడియోను చూస్తూ తెగ సంబరపడిపోతోన్నారు. ఈ వీడియోలో ఆ రెసిపీని ఎలా తయారు చేయాలో క్లియర్‌గా చూపించారు. టర్కీష్ పోచ్డ్ ఎగ్ అంటూ చేసిన ఈ వంటకం చూస్తే నోరూరిపోయేలా ఉంది. సండే రోజన బ్రంచ్ (బ్రేక్ ఫాస్ట్ ప్లస్ లంచ్) ఇదేనంటూ చెప్పుకొచ్చారు. ఇక కీర్తి సురేష్ ఆ వంటకాన్ని బాగానే లాగించినట్టున్నారు. కీర్తి సురేష్ ఈ మధ్య వార్తల్లో తెగ హల్చల్ అవుతున్నారు. ఈ మధ్య వ్యాక్సిన్ కూడా వేయించుకున్నారు. తమిళ నాడు ప్రభుత్వం తరుపున ప్రచారం చేస్తూ కోవిడ్ నిబంధనలపై ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. కీర్తి సురేష్ ఇప్పుడు గుడ్ లక్ సఖి సినిమాతో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీగా ఉన్నారు. అంతేకాకుండా సర్కారు వారి పాట షూటింగ్ కోసం ఆమె ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wKpnJS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....