Saturday, 29 May 2021

Prema కాదంట: అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుయేల్‌‌ మధ్య రొమాన్స్‌‌ రివీల్ అయ్యిందిలా

బ్లాక్ బస్టర్ హిట్ కోసం అల్లు వారి అబ్బాయి శిరీష్ గట్టి యుద్ధమే చేస్తున్నాడు. ‘గౌరవం’, ‘కొత్త జంట’, ‘శ్రీ రస్తు శుభమస్తు’ వంటి చిత్రాలతో ఆకట్టుకునే ప్రయత్నం చేసిన అల్లు శిరీష్ ఈసారి గేర్ మార్చి ప్యూర్ రొమాంటిక్ జానర్‌లోకి వచ్చేశాడు. అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ జంట‌గా ఓ సినిమా తెర‌కెక్కుతోన్న విష‌యం తెలిసిందే. దీనికి సంబంధించిన వరుసగా ఫ్రీ లుక్స్‌ని రిలీజ్ చేసి సినిమాపై హైప్ తీసుకుని రాగా.. నేడు (మే 30) అల్లు శిరీష్ బర్త్ డే కానుకగా.. ఫస్ట్ లుక్, టైటిల్‌ని విడుదల చేశారు. జీఏ2పిక్చ‌ర్స్ బ్యాన‌ర్, శ్రీ తిరుమ‌ల ప్రొడ‌క్ష‌న్స్ ప్రైవేట్ లిమిటెడ్ సంయుక్తంగా నిర్మిస్తున్న ఈ చిత్రానికి ‘ప్రేమ కాదంట’ () అనే టైటిల్‌ని ఫిక్స్ చేస్తూ ఫస్ట్ లుక్‌ను రిలీజ్ చేశారు. ప్రీ లుక్స్‌లో చేతిని అడ్డంగా పెట్టి కిస్ చేసుకుంటున్న పోస్టర్స్‌ని రివీల్ చేసి ఈ ఫస్ట్ లుక్‌లో చూపించారు. ‘విజేత’, ‘జతకలిసే’ ఫేమ్ రాకేష్ శశి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో శిరీష్ తొలిసారి సిక్స్ ప్యాక్‌తో సంద‌డి చేయ‌నున్నాడు. ఈ సిక్స్ ప్యాక్‌కి సంబంధించిన ఫొటోలు ఇప్పటికే వైరల్ అయ్యాయి. ఈ చిత్రానికి అనూప్ రూబెన్స్, అచ్చు రాజ‌మ‌ణి సంగీతాన్ని అందిస్తున్నారు. ఇదిలా ఉంటే.. గత కొంతకాలంగా అల్లు శిరీష్, అను ఇమ్మాన్యుల్ డేటింగ్‌లో ఉన్నట్టు వార్తలు వచ్చాయి. పెళ్లి కూడా చేసుకుంటారనే ప్రచారం గట్టిగానే నడిచింది. అయితే ఇప్పుడు ఈ ఇద్దరూ కలిసి ‘ప్రేమ కాదంట’ (Prema కాదంట) అని అంటుండటంతో ఈ సినిమాపై మంచి అంచనాలు ఏర్పడ్డాయి.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2SFzbWS

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....