Sunday, 30 May 2021

‘కన్నులు చెదిరే’ లిరికల్ వీడియో.. ఆకట్టుకుంటోన్న శివానీ రాజశేఖర్

‘118’ వంటి విభిన్న చిత్రాన్ని తెరకెక్కించిన ప్రముఖ సినిమాటోగ్రాఫర్‌ కేవి గుహన్‌ అందరి దృష్టిని ఆకర్షించారు. మళ్లీ ఇప్పుడు మిస్టరీ థ్రిల్లర్‌ ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ (ఎవరు,ఎక్కడ,ఎందుకు) అంటూ ప్రేక్షకుల ముందుకు రాబోతోన్నారు. అదిత్‌ అరుణ్, శివాని రాజశేఖర్‌ హీరో హీరోయిన్లుగా నటిస్తున్న ఈ చిత్రాన్ని రామంత్ర క్రియేషన్స్ పతాకంపై డా. రవి పి. రాజు దాట్ల నిర్మిస్తున్నారు. తాజాగా ఈ చిత్రంలోని ‘కన్నులు చెదిరే’లిరికల్ వీడియో సాంగ్ ను యంగ్ హీరో అడవి శేష్‌ విడుదల చేసి చిత్రయూనిట్‌కు ఆల్‌ ది బెస్ట్‌ చెప్పారు. ఇక ఈ లిరికల్ వీడియోలో అందరినీ ఆకట్టుకుంటోంది. ఈ సందర్భంగా దర్శకుడు కేవి గుహన్‌ మాట్లాడుతూ.. ‘డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ’ ఫస్ట్‌ కంప్యూటర్‌ స్క్రీన్‌ తెలుగు మూవీ. తెలుగు, తమిళ భాషల్లో ఏక కాలంలో సినిమా రూపొందుతోంది. ఇప్పటికే విడుదలైన టీజర్ సాంగ్స్ కి మంచి రెస్పాన్స్ వస్తోంది. తప్పకుండా థ్రిల్లర్‌ జోనర్‌లోనే ఇది ఒక డిఫరెంట్‌ మూవీగా నిలుస్తుంది అని అన్నారు. నిర్మాత రవి పి.రాజు దాట్ల మాట్లాడుతూ .. ‘మా రామంత్ర క్రియేష‌న్స్ బేన‌ర్‌లో రూపొందుతోన్న ఫ‌స్ట్ మూవీ ఇది. ఇప్పటికే సూపర్ స్టార్ మహేష్ బాబు రిలీజ్ చేసిన టీజర్, తమన్నా రిలీజ్ చేసిన నైలు నది సాంగ్ కి అద్భుతమైన స్పందన వచ్చింది. రీసెంట్‌గా రిలీజైన లాక్ డౌన్ ర్యాప్ సాంగ్‌కి కూడా మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు కన్నులు చెదిరే సాంగ్‌ను యంగ్ హీరో అడివిశేష్ విడుదల చేయడం హ్యాపీగా ఉంది. ఈ సందర్భంగా మా రామంత్ర క్రియేషన్స్ తరపున అడివిశేష్‌కి దన్యవాదాలు తెలియజేస్తున్నాం. అదిత్ అరుణ్, శివాని రాజశేఖర్ చక్కగా నటించారు. గుహ‌న్ ఈ సినిమాని అద్బుతంగా తెర‌కెక్కించారు. తప్పకుండా ఈ మూవీ చాలా పెద్ద హిట్ అవుతుంద‌ని న‌మ్మ‌కం ఉంద’ని అన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3p1kx8D

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....