Wednesday, 26 May 2021

RRR: కన్నీళ్లు పెట్టించే ఫైట్ సీన్స్.. ఆ ఒక్క సన్నివేశంలో ఎన్టీఆర్..! అలా బయటకొచ్చిన సీక్రెట్స్

ఎప్పుడైతే RRR సినిమాను అనౌన్స్ చేశారో అప్పటి నుంచి ఈ సినిమాపై దేశవ్యాప్తంగా ఉన్న ఆడియన్స్ చూపు పడింది. పైగా నేటితరం స్టార్ హీరోలు , హీరోలుగా నటిస్తుండటం సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేసింది. చాలా రోజులుగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ విడుదల కోసం ఎంతో ఆతృతగా ఎదురుచూస్తున్నారు జనం. అయితే ఈ సినిమాకు సంబంధించి స్టోరీ రైటర్ KV ఓ సీక్రెట్ విషయాన్ని బయటపెట్టి ఇప్పటికే ఉన్న అంచనాలకు రెక్కలు కట్టారు. డీవీవీ దానయ్య సమర్పణలో భారీ బడ్జెట్ కేటాయించి రుపోనిదిస్తున్న ఈ RRR (రౌద్రం రణం రుధిరం) మూవీలో ఎన్టీఆర్ కొమురం భీం రోల్ పోషిస్తుండగా, అల్లూరి సీతారామరాజుగా రామ్ చరణ్ నటిస్తున్నారు. ఇప్పటికే విడుదలైన పోస్టర్స్, అన్ని అప్‌డేట్స్ ఓ రేంజ్ రెస్పాన్స్ తెచ్చుకున్నాయి. దీంతో ప్రపంచవ్యాప్తంగా ఎక్కడ చూసినా ఈ సినిమా గురించిన చర్చలే వినిపిస్తున్న నేపథ్యంలో విజయేంద్రప్రసాద్ మొదటిసారి సినిమా గురించి వివరణ ఇవ్వడం ఆసక్తికరంగా మారింది. ఎమోషన్స్ బాగా వర్కౌట్ అవుతేనే సినిమా బాగా వస్తుంది.. అలాంటి అంశాలు RRRలో పుష్కలంగా ఉన్నాయని, RRR గురించి ఎంత ఎక్కువ చెప్పినా అది తక్కువే అవుతుందని విజయేంద్రప్రసాద్ అన్నారు. యాక్షన్ సీన్స్ చూసి ప్రేక్షకులు ఈలలు వేస్తూ గోల పెట్టడం చూసాం.. కానీ ఈ సినిమాలోని కొన్ని యాక్షన్ సీన్స్ చూసినప్పుడు తాను కన్నీళ్లు పెట్టుకున్నానని చెప్పారు. ఆ సీన్స్ చూస్తే ప్రతి ఒక్క ప్రేక్షకుడు నాలాగే భావోద్వేగానికి గురవుతాడని చెబుతూ.. ఎన్టీఆర్‌కి సంబంధించిన ఓ ఎమోషన్ సీన్ నెవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అనేలా ఉంటుందని తెలిపారు. RRRకు వర్క్ చేయడం గర్వంగా ఉందని ఇప్పటికే నటీనటులు పేర్కొన్నారు. రామ్ చరణ్, ఎన్టీఆర్ అభిమానులకు ఎంతో నచ్చేవిదంగా సినిమా ఉంటుందని, జక్కన్న ఇద్దరి హీరోల క్యారెక్టర్స్ సమానంగా చెక్కారని టెక్నీషియన్స్ తెలిపారు. అనుకోని కారణాల వల్ల వాయిదా పడుతూ వస్తున్న ఈ మూవీ రిలీజ్ కోసం జనం ఆతృతగా ఎదురుచూస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hWUP3I

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....