Sunday, 30 May 2021

చిన్న ‘సైజు’-పెద్ద రెస్పాన్స్.. ‘ఏక్ మినీ కథ’పై చాందిని చౌదరి బోల్డ్ రియాక్షన్

ప్రస్తుతం టాలీవుడ్ సెలెబ్రిటీలను అనే సినిమా ఆకట్టుకుంటోంది. అమెజాన్ ప్రైమ్‌లో విడుదలైన ఈ మూవీకి మంచి ప్రశంసలు లభిస్తున్నాయి. అయితే ఏక్ మినీ కథ కొత్త కాన్సెప్ట్ అవ్వడం, బోల్డ్ కాన్సెప్ట్ అయినా కూడా ఎక్కడా ఆ ఛాయలు పడకుండా ఆద్యంతం వినోద భరితంగా తెరకెక్కించడంతో అందరూ కనెక్ట్ అవుతున్నారు. జననాంగం చిన్నదిగా ఉందనే అనుమానంలో హీరో ఉండటం, కథనం కూడా చిన్నగా ఉందే అనే హీరో బాధ చుట్టే తిరుగుతుంది. అలా చిన్న సమస్యతో సినిమా తీసి పెద్ద స్థాయిలో స్పందన రాబట్టుకున్నారు. తాజాగా ఈ మూవీపై ఓ హీరోయిన్ కామెంట్ చేశారు. ఏక్ మినీ కథపై సెలెబ్రిటీలు ఎక్కువగా స్పందిస్తున్నారు. ఈషా రెబ్బా, ప్రియాంక జవాల్కర్ వంటి వారంతా సినిమాను వీక్షించి ప్రశంసలు కురిపించారు. ఇక ఎప్పటిలానే వెన్నెల కిషోర్ తన స్టైల్లో పంచ్‌లు వేశారు. మరీ ముఖ్యంగా బ్రహ్మాజీ పాత్రకు, ఆయన నటనకు నెటిజన్లు ఫిదా అయ్యారు. తాజాగా ఈ మూవీని వీక్షించారు. ఈ మేరకు తన అభిప్రాయాన్ని పంచుకున్నారు. ఏక్ మినీ కథపై చాందినీ చౌదరి తన స్టైల్లో స్పందించారు. ఎంతో సరదాగా సాగేసినిమా.. ఎంతో దగ్గరి సంబంధం ఉంటూనే.. రియాల్టీని చూపిస్తుంది. గత రాత్రి ఈ మూవీని చూశాను..సంతోష్ శోభన్‌తో ప్రతీ ఒక్క సీన్ గురించి చర్చించాను. దవడలను నొచ్చేంత నవ్వుకున్నాం. సంతోష్ దర్శన్ మధ్య ఉన్న బ్రొమాన్స్ కూడా అదిరిపోయింది. అమృత, స్వామి పాత్రలు బాగున్నాయ్ అంటూ చాందినీ చౌదరీ అన్నారు. ఇక చాందినీ చౌదరికి సైతం ఓటీటీతో మంచిపేరు వచ్చింది. గత ఏడాది వచ్చిన కలర్ ఫోటో సినిమాతో చాందినీ చౌదరి మరింతగా పాపులర్ అయ్యారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fwoIGj

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....