Saturday, 29 May 2021

సమంత ఫిక్స్ అయింది కానీ ఆ మాట చెప్పడంతో! యాంకర్ ప్రదీప్ మూవీ సీక్రెట్స్ రివీల్ చేసిన డైరెక్టర్

'30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' అంటూ ఇటీవలే ప్రేక్షకుల ముందుకొచ్చిన సంగతి తెలిసిందే. బుల్లితెరపై హవా నడిపిస్తూ తనకంటూ ఓ స్పెషల్ ఇమేజ్ క్రియేట్ చేసుకున్న ఆయన.. ఈ సినిమాతో హీరోగా పరిచయమయ్యారు. ఈ మూవీలో ప్రదీప్ సరసన హీరోయిన్‌గా నటించింది. అయితే ముందుగా ఆ అవకాశం సమంతకు వచ్చిందట. ఈ కథను సమంతకు వినిపించారట . తాజాగా జరిగిన ఓ ఇంటర్వ్యూలో మూవీ షూటింగ్‌కి ముందు జరిగిన గురించిన కొన్ని విషయాలు రివీల్ చేశారాయన. 30 రోజుల్లో ప్రేమించడం ఎలా? కథ రాసుకున్నాక హీరోహీరోయిన్ల వేట ప్రారంభించిన డైరెక్టర్ మున్నా.. ముందుగా స్టార్ హీరోయిన్ సమంతకు ఈ కథ చెప్పానని అన్నారు. మేనేజర్ వద్దకు వెళ్ళినప్పుడు ఆమెకు కథ చెబుతాను అంటే పైనుంచి కింద దాకా చూస్తూ అలా ఎలా కుదురుతుందని ప్రశ్నించాడని, అయితే ముందు ఆ కథను అతనికి చెప్పి మెప్పించాక సమంతకు కలిసే అవకాశం పొందానని అన్నారు మున్నా. ఇక కథ విన్న సమంత చాలా బాగుందని చెప్పిందని, కాకపోతే డేట్స్ అడ్జస్ట్ కాకపోవడంతో ఆమె ఈ సినిమాలో నటించనని చెప్పిందని ఆయన తెలిపారు. సమంతను హీరోయిన్‌గా అనుకున్నపుడు ఇంకా హీరోగా యాంకర్ ప్రదీప్‌ని ఫైనల్ చేయలేదని ఆయన చెప్పారు. ఆ తర్వాత ప్రదీప్ హీరోగా ఒప్పుకున్నాక అమృత అయ్యర్‌ని ఫైనల్ చేశానని.. ఇక ఆమెలోనే సమంతను చూసుకుంటూ సినిమా రూపొందించామని మున్నా చెప్పడం విశేషం. పునర్జన్మల నేపథ్యంలో తెరకెక్కిన '30 రోజుల్లో ప్రేమించటం ఎలా?' సినిమా ఈ ఏడాది మొదట్లో విడుదలై ఫర్వాలేదనిపించింది. చిత్రంలోని ''నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా'' సాంగ్ ఫుల్ పాపులర్ అయింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vDvhfY

No comments:

Post a Comment

'I Wanted Waheeda Rehman For Ankur'

'I don't think Waheeda had the confidence that I could pull it off, so she said no.' from rediff Top Interviews https://ift.tt...