Sunday, 30 May 2021

కెరీర్‌లో అతిపెద్ద ప్రాజెక్ట్.. విజయ్‌తో సినిమా.. వంశీ పైడిపల్లి కామెంట్స్

దిల్ రాజు కాంపౌండ్‌లో ఉంటారన్న సంగతి తెలిసిందే. మొదటి నుంచి కూడా వంశీ పైడిపల్లి ఆస్థాన దర్శకుడు. మహర్షి వంటి బ్లాక్ బస్టర్ హిట్ తరువాత మళ్లీ అదే కాంబో రిపీట్ కావాల్సింది. కానీ కొన్ని సమస్యల వల్ల మహేష్ బాబు వంశీ పైడిపల్లి దిల్ రాజు కాంబో క్యాన్సిల్ అయింది. తాను తదుపరి చేయబోయేది వంశీ పైడిపల్లితోనే అని మహేష్ బాబు కూడా స్వయంగా చెప్పుకొచ్చారు. కానీ పరిస్థితులు మారిపోయాయి. అలా మధ్యలో సరిలేరు నీకెవ్వరు సినిమా వచ్చింది. అలా ఓ సూపర్ కాంబో మళ్లీ మిస్ అయింది. అయితే ఇప్పుడు వంశీ పైడిపల్లికి అదిరిపోయే కాంబోను దిల్ రాజు సెట్ చేశారు. ఏకంగా తమిళ స్టార్ హీరో దళపతి విజయ్‌ను తెలుగులోకి తీసుకొస్తున్నారు. ఆ సినిమాకు వంశీ పైడిపల్లి దర్శకత్వం వహించబోతోన్నారు. ఈ మేరకు వంశీ పైడిపల్లి స్వయంగా ఓ మీడియాతో ఈ విషయాలన్నీ పంచుకున్నారు. ఇన్ని రోజులు ఈ ప్రాజెక్ట్ మీద రకరకాల రూమర్లు వచ్చేవి. కానీ వంశీ పైడిపల్లి స్వయంగా నోరు విప్పి మాట్లాడటంతో ఈ ప్రాజెక్ట్ గురించి సోషల్ మీడియాలో హాట్ టాపిక్ నడుస్తోంది. దళపతి 66వ సినిమా అంటూ ట్విట్టర్‌లో నేషనల్ వైడ్ ట్రెండ్ అవుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ గురించి వంశీ పైడిపల్లి మాట్లాడుతూ.. ‘నా కెరీర్‌లో అతి పెద్ద ప్రాజెక్ట్ కోవిడ్ తగ్గిన తరువాత ప్రారంభం కాబోతోంది. రాజుగారు నిర్మించే ఈ చిత్రంలో నటిస్తారు. ప్రస్తుతం కోవిడ్ సమయం కాబట్టి దీనిని ప్రకటించలేదు. పరిస్థితులు అన్నీ చక్కబడిన తర్వాత ఈ చిత్రాన్ని అధికారికంగా ప్రకటిస్తారు. అంతదాకా మిగిలిన సమాచారం అంతా సస్పెన్స్’అని ఆసక్తిని పెంచేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uzaHMc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....