Sunday 30 May 2021

క్రేజీ ఆఫర్ కొట్టేసిన జాతిరత్నాలు బ్యూటీ.. ఏకంగా బడా హీరోతో రొమాన్స్! అదృష్టం అంటే ఈ బ్యూటీదే..

చిత్రసీమలో హీరోహీరోయిన్స్ ఆఫర్స్ విషయంలో మరీ విచిత్రమైన పరిస్థితులు కనిపిస్తుంటాయి. అదేంటో.. కొందరు నటీనటులకు తొలి సినిమానే పెద్ద ఎసెట్ అవుతుంది. మొదటి సినిమానే ఓ మైలురాయిగా నిలిచిపోయి ఆఫర్ల వెల్లువకు కారణమవుతుంది. ఇలాంటి హీరో హీరోయిన్స్ లిస్టులో '' బ్యూటీ ఒకరు. 'చిట్టి'గా వెండితెరపై అలరించి ఫస్ట్ మూవీతోనే ఫుల్ పాపులర్ అయింది ఈ లోకల్ బ్యూటీ. దీంతో తాజాగా ఫరియా అబ్దుల్లాకు క్రేజీ ఆఫర్స్ వస్తున్నాయట. మోడల్‌గా కెరీర్‌ ఆరంభించిన ఫరియా.. ‘జాతి రత్నాలు' సినిమాతో హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చింది. ఈ మూవీ విడుదలకు ముందే ప్రభాస్ చేసిన కామెంట్స్‌తో ప్రతి ఒక్కరి కన్ను ఈ అమ్మడిపై పడింది. తీరా మూవీ రిలీజ్ తర్వాత నవీన్ పోలిశెట్టి లవర్‌గా యువత మనసు దోచేసింది ఫరియా. తనదైన హావభావాలు పలికించి సినిమా విజయంలో భాగం పంచుకుంది. చిట్టి ఆట, పాట చూసి యూత్ ఆడియన్స్ ఫిదా అయిపోయారు. దీంతో ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయట. కాకపోతే సినిమా సెలక్షన్ విషయంలో అమ్మడు ఆచితూచి నిర్ణయం తీసుకుంటోందట. అయితే రీసెంట్‌గా ఓ భారీ సినిమా కథ నచ్చడంతో ఆమె ఓకే చెప్పిందనేది లేటెస్ట్ టాక్. టాలీవుడ్ బడా హీరో నుంచి రాబోతున్న ఓ సీక్వెల్‌లో ఫరియా అబ్దుల్లా అవకాశం దక్కించుకుందని తెలుస్తోంది. ఆ మూవీ దర్శకనిర్మాతలు ఆమెకు భారీ రెమ్మ్యూనరేషన్ కూడా ఆఫర్ చేశారట. కథలో ఆమెనే కీలకం కాబోతుందని అంటున్నారు. అయితే ఆ హీరో ఎవరనేది మాత్రం బయటకు రాలేదు. మొత్తానికైతే ఈ భారీ సినిమాలో భాగం కాబోతున్న విషయాన్ని అతిత్వరలో అఫీషియల్‌గా ప్రకటించబోతున్నారని సమాచారం. మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్‌గా ఉంటూ హవా నడిపిస్తోంది ఫరియా అబ్దుల్లా. నిత్యం గ్లామర్ ట్రీట్ ఇస్తూ అమ్మడు చేస్తున్న హంగామా అంతా ఇంతా కాదండోయ్. హాట్ హాట్ డ్యాన్స్ వీడియోలు, ఫోటోలు తన సోషల్ మీడియా ఖాతాల్లో షేర్ చేస్తూ అట్రాక్ట్ చేస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fyhIc0

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz