Friday 28 May 2021

SP Balu: ఎస్పీ బాలుది హత్య.. వాళ్లే చంపేశారు, ఆనందయ్య మందుని రానియ్యరు: వీరమాచినేని సంచలన వ్యాఖ్యలు

గాన గంధర్వుడు.. లెజెండరీ సింగర్ గత ఏడాది సెప్టెంబర్ 25న మరణించిన విషయం తెలిసిందే. కరోనా వైరస్ బారినపడి.. వయసు రీత్యా ఆయన తిరిగి కోలేకపోయారు. సుమారు 20 రోజుల పాటు చెన్నై ఎంజీఎం హాస్పటల్‌లో కరోనాతో పోరాడి తుదిశ్వాస విడిచారు బాలు. అయితే ఆయన మరణించి 8 నెలలు గడుస్తుండగా.. ఎస్పీ బాలు మరణంపై పలు అనుమానాలు వ్యక్తం చేస్తూ సంచలన వ్యాఖ్యలు చేశారు ప్రముఖ డైట్ స్పెషలిస్ట్, విశ్లేషకుడు రామకృష్ణ. విజయవాడకు చెందిన వీరమాచినేని.. స్పెషల్ డైట్ ద్వారా మధుమేహం, బీ.పీ, ఊబకాయం వంటి వ్యాధులకు డైట్ ఇస్తూ హాట్ టాపిక్ అయ్యారు. తెలుగు రాష్ట్రాలలో ఈయన చెప్పిన డైట్‌ను కొన్ని లక్షల మంది ఫాలో అవుతున్న విషయం తెలిసిందే. ఇదిలాఉంటే ప్రస్తుతం రెండు తెలుగురాష్ట్రాలతో పాటు దేశ వ్యాప్తంగా నెల్లూరు ఆనందయ్య నాటు వైద్యంపై హాట్ టాపిక్ నడుస్తోంది. ఈ ఇష్యూ గురించి ఓ టీవీ ఛానల్‌ నిర్వహించిన డిబేట్‌లో పాల్గొన్న వీరమాచినేని.. కరోనాకి సరైన ట్రీట్ మెంట్ లేక ప్రజలు ఇబ్బందులు పడుతుంటూ కొంతమంది డాక్టర్లు బుద్ది, బుర్ర లేకుండా పనిచేస్తున్నారని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ బాలు మరణాన్ని గురించి ప్రస్తావిస్తూ.. ‘ఎస్పీ బాలుని హత్య చేసింది ఎవరు?? వీళ్లు కాదా.. ఆయన్ని చంపేసి తప్పించుకుని తిరగడం లేదా?? బాలసుబ్రహ్మణ్యం అనారోగ్యంతో హాస్పటల్‌కి వెళ్లాడా.? ఏదైనా యాక్సిడెంట్‌లో పచ్చడైపోయి హాస్పటల్‌కి వెళ్లలేదు కదా.. హాస్పటల్‌ని నడుచుకుంటూ పాటలు పాడుకుంటూ వెళ్లాడు. కానీ తిరిగిరాలేదు. ఆయనలా ఎంతమంది.. ఆయనపై ప్రయోగాలు చేసి చంపేశారు. ఆ ప్రయోగాలను ప్రొటోకాల్ లేదు. ఎస్పీ బాలు చికిత్సలో లోపాలు ఉన్నాయని నేను చెప్పడం కాదు.. వందలమంది డాక్టర్లు చెప్పారు. హాస్పటల్‌కి వెళ్లినప్పుడు ఎంతో హ్యాపీగా వెళ్లాడు.. ఏం లేదు పోవయ్యా అంటే ప్రాణంతో వచ్చేసేవారు. ఆరోగ్యంతో ఉన్న ఆయన్ని తీసుకుని వెళ్లి.. ప్రయోగాలు చేసి చంపేశారు. అన్ని మందులు ఇస్తే.. ఆయనే కాదు మనమైనా చచ్చిపోతాం. అసలు మనిషి స్టామినా ఎంత?? వాళ్లు ఇచ్చే మందుల పవర్ ఎంత?? మనిషి తట్టుకోగలడా?? ఈ మందుల పరిస్థితి ఎలా ఉందంటే.. ఇంట్లో ఎలుకని చంపాలంటే ఇళ్లు తగలబెట్టండి అన్నట్టుగా ఉంది. అదేంటండీ ఇల్లు కాలిపోతుంది అంటే.. నువ్ ఎలుక చావాలన్నావ్ గా.. ఇల్లు తగలబడనియ్ అంటారు. ఏ.. ఇల్లు కాలకుండా ఎలుక చావకూడదా? ఆ మాత్రం చేయలేరా? ఇప్పుడు ఆనందయ్య మందుకి కరోనా తగ్గుతుందని రుజువు అయ్యినా.. మన కేంద్ర ప్రభుత్వం, మీడియా దాన్ని తొక్కి అవతల పడేస్తారు. ఇందులో ఎలాంటి సందేహం లేదు. ఆనందయ్య మందు వచ్చినా వేరే వాళ్లు మందు వచ్చినా లక్షల కోట్లు దోపిడీ కుదరదు కాబట్టి.. వ్యాపార ప్రయోజనాలకోసం ఇలాంటి ఆనందయ్యల్ని ఎంకరేజ్ చేయరు. ఎందుకంటే.. ఇలాంటి వాళ్లు ఎలక్షన్ ఫండ్ ఇచ్చే అవకాశం ఉండదు. ఇవన్నీ పచ్చి నిజాలు’ అంటూ కుండబద్దలు కొట్టారు వీరమాచినేని.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TgqUcb

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz