Friday, 28 May 2021

HANUMAN అంటూ అదరగొట్టేశాడు.. మరో కొత్త జానర్‌లో ప్రశాంత్ వర్మ

భిన్న చిత్రాల దర్శకుడు మరో కొత్త జానర్‌తో ప్రేక్షకులను పలకరించేందుకు రెడీ అవుతున్నారు. అ!, కల్కి, జాంబీరెడ్డి అంటూ తన సత్తాను చాటుకున్నారు. తీసిన ప్రతీ సినిమా కొత్తగా ఉండాలనే తాపత్రయం ప్రశాంత్ వర్మలో కనిపిస్తుంటుంది. ఫలితాల గురించి పట్టించుకోకుండా ప్రయోగాల బాట పడుతూనే ఉంటారు. అలా ప్రశాంత్ వర్మ సినిమాలంటే తెలుగు ప్రేక్షకులకు ఓ స్థాయి అంచనాలుంటాయి. అయితే ఇప్పుడు ప్రశాంత్ వర్మ తన నాల్గో ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రకటన చేశారు. ప్రశాంత్ వర్మ బర్త్ డే సందర్బంగా నేడు ఈ ప్రకటనను చేశారు. మరో కొత్త జానర్‌లో రాబోతోందని, అదేంటో గెస్ చేయండని ప్రశాంత్ వర్మ నిన్న ఓ హింట్ వదిలారు. హిమాలయాలను చూపిస్తూ వదిలిన ఆ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంది. అయితే తాజాగా సినిమా టైటిల్‌ను ప్రకటించారు. ఈ సారి ఇండియన్ రియల్ సూపర్ హీరో మీద సినిమా తీసేందుకు రెడీ అయ్యారు. స్పైడర్ మెన్, ఐరెన్ మెన్ అంటూ మనం విదేశీ సూపర్ హీరోలను కీర్తిస్తుంటాం. కానీ మన పురాణాల్లోని రియల్ సూపర్ హీరోల గురించి ఎక్కువగా చెప్పుకోం. అలా రియల్ సూపర్ హీరో అయిన మీద ప్రశాంత్ వర్మ దృష్టిపెట్టేశారు. అంటూ వదిలిన ఈ టైటిల్ మోషన్ పోస్టర్ అందరినీ ఆకట్టుకుంటోంది. మొత్తానికి ఈ సారి మైథాలిజికల్ మూవీతో ప్రశాంత్ వర్మ మ్యాజిక్ చేయబోతన్నాడన్న మాట. అయితే ఈ మూవీకి సంబంధించిన వివరాలు త్వరలోనే ప్రకటిస్తామని అన్నారు. క్యాస్ట్ అండ్ క్రూపై రకరకాల వార్తలు వస్తున్నాయి కానీ ఇందులో ఏది నిజమో తెలియాలంటే ఇంకొన్ని రోజులు ఆగాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3wHIJ2l

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....