Sunday, 30 May 2021

సినిమా రౌండప్: మెగాస్టార్ మూవీపై ఫుల్ క్లారిటీ.. రెడీ అనేసిన వెంకటేష్.. రేస్‌లో పవన్ కళ్యాణ్

లూసిఫర్ రీమేక్‌- ఫుల్ క్లారిటీ రీ- ఎంట్రీ తర్వాత జోష్‌లో ఉన్న చిరంజీవి వరుస సినిమాలు ఓకే చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలోనే లూసిఫర్ రీమేక్‌ను స్టార్ట్ చేయాలని అనుకున్నారు. ఈ మూవీకి మోహన్ రాజా దర్శకత్వం వహించబోతున్నారు. అయితే ఈ మూవీ దర్శకుడిగా మోహన్ రాజా తప్పుకున్నాడని వస్తున్న వార్తలకు ఫుల్ స్టాప్ పెట్టేలా కొణిదెల ప్రొడక్షన్ - సూపర్ గుడ్ ఫిలిమ్స్ బ్యానర్స్ ఆయనకు బర్త్ డే విషెస్ అందించాయి. సంక్రాంతి రేస్‌లో పవన్ కళ్యాణ్ ప్రతి ఏడాది సంక్రాంతి సీజన్‌లో స్టార్ హీరోలు పోటీ పడుతుండటం చూస్తూనే ఉన్నాం. అయితే వచ్చే ఏడాది రేస్‌లో పవన్ కళ్యాణ్ నిలవబోతున్నరాట. దర్శకుడు క్రిష్ రూపొందిస్తున్న ‘హరిహర వీరమల్లు’ సినిమాను ‘సంక్రాంతి’ కానుకగా రిలీజ్ చేయబోతున్నారని సమాచారం. వెంకటేష్ హవా ప్రస్తుతం 'నారప్ప, దృశ్యం 2, ఎఫ్ 3' సినిమాలతో బిజీగా ఉన్న విక్టరీ వెంకటేష్ తాజాగా మరో చిత్రానికి ఓకే చెప్పినట్టు తెలుస్తోంది. 'కేరాఫ్ కంచరపాలెం' దర్శకుడు మహా వెంకటేష్ చెప్పిన కథకు ఆయన గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని అంటున్నారు. 'సర్కారు వారి పాట' నుంచి క్రేజీ అప్‌డేట్ పరశురామ్ దర్శకత్వంలో మహేష్ బాబు హీరోగా రూపొందుతున్న 'సర్కారు వారి పాట' నుంచి వస్తున్న అప్‌డేట్స్ సూపర్ స్టార్ ఫ్యాన్స్‌ని హుషారెత్తిస్తున్నాయి. తాజా సమాచారం మేరకు మెయిన్ విలన్ కోసం అరవింద్ స్వామిని ఎంపిక చేశారని తెలుస్తోంది. బాలయ్యతో కుదరదన్న రకుల్ బాలకృష్ణ తదుపరి సినిమా గోపీచంద్ మలినేనితో చేయబోతున్న సంగతి తెలిసిందే. త్వరలోనే ఈ సినిమా సెట్స్ పైకి వెళ్లనుంది. అయితే ఈ మూవీలో హీరోయిన్ కోసం శృతి హాసన్‌ని సంప్రదించగా ఆమె నో చెప్పడంతో రకుల్ వద్దకు ఆఫర్ వెళ్లిందట. కానీ రకుల్ కూడా సింపుల్‌గా రిజెక్ట్ చేసిందని టాక్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fCpAJi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....