Saturday 29 May 2021

బాలయ్య గ్రేట్, క్యాస్ట్ ఫీలింగ్ లేదు.. మెగా హీరోల వల్ల కోట్లు నష్టపోయా.. చిరంజీవిని సినిమా అడగను: నిర్మాత సి. కళ్యాణ్

సీకే ఎంటర్ టైన్మెంట్స్ బ్యానర్‌లో నిర్మాత సి. కళ్యాణ్ భారీ బడ్జెట్ చిత్రాలను నిర్మించారు. నందమూరి బాలకృష్ణతో బాగా చనువుగా ఉండే ఈయన.. రూలర్, జై సింహా చిత్రాలను చేయడంతో ఈయన్ని బాలయ్య ప్రొడ్యుసర్ అని అంటుంటారు. ఇక మెగా హీరోలు వరుణ్ తేజ్‌తో లోఫర్, సాయి ధరమ్‌ తేజ్ తో ఇంటిలిజెంట్ సినిమాలు చేసిన ఆయన.. ఈ రెండు చిత్రాలు ఫ్లాప్ కావడంతో కోట్లలో నష్టపోయారు. అప్పటి నుంచి మెగా ఫ్యామిలీకి దూరమయ్యారని మెగా హీరోలతో విభేదాలు ఉన్నాయని వార్తలు రాగా వీటిపై క్లారిటీ ఇస్తూ బాలయ్యతో ఉన్న అనుబంధాన్ని అలాగే మెగా హీరోలతో గ్యాప్ రావడానికి గల కారణాలను తెలియజేశారు. ‘ గారు నన్ను తన సొంత ఫ్యామిలీ మెంబర్‌గా రిసీవ్ చేసుకున్నారు.. ఇందులో క్యాస్ట్ ఫీలింగ్ ఏం లేదు. మా క్యాస్ట్‌‌నే కదా అనే ఏమీ చేసేది ఉండదు. ఒకే కులం అయినా ఒకడ్నొకడు తోసేసుకుంటారు. మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే ప్రస్తుతం ఉన్న ప్రొడ్యుసర్లు.. డేట్స్‌ కోసం హీరోల దగ్గరకు వెళ్లి పెర్ఫామెన్స్ చేస్తుంటారు. నాకు ఆ టైప్ పెర్ఫామెన్స్ చేయడం రాదు.. అలవాటు లేదు. బాలకృష్ణ గారి దగ్గర అలాంటి పెర్ఫామెన్స్ అవసరం లేదు. ఇలాంటి వాటికి ఇష్టపడరు. ఏదైనా ఉంటే సూటిగా.. కుండబద్దలు కొట్టినట్టే ఉంటుంది. సినిమాకి సంబంధించిన విషయాలు మాట్లాడుకుంటాం.. ఇండస్ట్రీకి సంబంధించిన విషయాలు ఆయన దగ్గర చెప్పలేరు.. చెప్పే ధైర్యం చేయరు. కానీ ఎందుకో బాలకృష్ణ గారు నాకు ఆ పర్మిషన్ ఇచ్చారు. ఏదైనా ఇష్యూ ఉంటే.. ఆయన దగ్గర చెప్తే కన్వెన్స్ అవుతారు. బాలయ్య దగ్గర నాకు ఆ చనువు ఉంది.. ఎదైనా విషయం నచ్చకపోతే.. లాగే పరిస్థితి ఉండదు. క్షణాల్లోనే నాకు ఇది నచ్చలేదు నేను చేయను అని చెప్పేస్తారు. ఇక మెగా ఫ్యామిలీ విషయానికి వస్తే.. నేను ఎవరికీ బాకీలేను అని చెప్పాను. కానీ నా ‘ఇంటిలిజెంట్’ సినిమా టాపిక్‌లో ఇన్సిడెంట్ ఉంది. నేను మెగా హీరోల్లో వరుణ్ తేజ్‌తో చేశా.. నాగబాబు అంటే నాకు బాగా ఇష్టం. ఆయనతో నాకు బాగా అటాచ్‌మెంట్ ఉంది. వరుణ్‌ని నా కొడుకు అనుకునే నేను సినిమా తీశా. కావాల్సిన దానికంటే ఎక్కువ ఖర్చు పెట్టా. కానీ వరుణ్ తేజ్‌తో చేసిన సినిమా (లోఫర్)కి ఏడు కోట్లు నష్టం వచ్చింది. పైగా ఆ సినిమాకి వరుణ్ తేజ్ ముందు సినిమాకంటే కూడా ఎక్కువ రెమ్యునరేషన్ ఇచ్చా. నేను పర్ఫెక్ట్‌గానే చేశాను కదా.. వాళ్ల సైడ్ నుంచే రెస్పాన్స్ వస్తుందని వెయిట్ చేస్తా. కానీ తరువాత రెండు మూడుసార్లు అనుకున్నాం కానీ.. కాంబినేషన్ కుదర్లేదు. నాకు నష్టం వచ్చింది కదా.. నాతో సినిమా చేయాల్సిందే అని వాళ్ల దగ్గరకు వెళ్లింది లేదు. ఈ సినిమానే కాదు.. ఏ సినిమాకి నష్టం వచ్చినా నాతో మరో మూవీ చేయండని నేను అడగను. ఆ తరువాత మరో మెగా హీరో సాయి ధరమ్ తేజ్‌తో ఇంటిలిజెంట్ సినిమా తీశాం. నిజానికి వి.వి వినాయక్‌ కాంబోలో ఎప్పటి నుంచో సినిమా తీద్దాం అనుకున్నాం. అది ఇంటిలిజెంట్‌తో సెట్ అయ్యింది కానీ.. సినిమా నిరుత్సాహ పరిచింది. టైం బాలేదు కాబట్టి ఫ్లాప్ అయ్యింది. ఈ సినిమా సబ్జెక్ట్ గురించి మొదటి నుంచి నేను చెప్తూనే ఉన్నాను అనుకున్నట్టుగా సినిమా తేడా కొట్టింది. ఆ సినిమా రిలీజ్ అప్పుడు కూడా హీరో సాయి ధరమ్ తేజ్ ఓవర్సీస్ రిలీజ్ చేయొద్దని ఆపాడు. ఆరోజు సాయి ధరమ్ తేజ్‌కి బయట వచ్చే రెమ్యూనరేషన్ కంటే ఎక్కువ చెప్తే.. నేను డైరెక్టర్‌తో మాట్లాడి సెట్ చేశాం. అయితే సినిమా అయిపోయిన తరువాత కూడా నేను హీరోకి రెమ్యూనరేషన్ బ్యాలెన్స్ సర్దేశా. ఆ సినిమా వల్ల నా లైఫ్‌లోనే కనీవినీ ఎరుగని రేంజ్‌లో డబ్బులు పోయాయి. అయినప్పటికీ నాకు వీవీ వినాయక్ అంటే కోపం లేదు.. నన్ను చాలా అభిమానిస్తాడు.. నేనూ అంతే గౌరవం ఇస్తా. ఆ సినిమా పోయినందుకు నాకంటే ఎక్కువ బాధపడ్డాడు వివి వినాయక్. ఏడాది వరకూ మనిషి కాలేకపోయాడు. మా అన్నయ్యకి ఇలా అయ్యిందే అని ఫీల్ అవుతుంటే.. నేనే వెళ్లి సర్ధిచెప్పా. వెంటనే బాలయ్య గారితో సినిమా చేయడానికి రెడీ అయ్యాం. మెగా ఫ్యామిలీతో ఈ రెండే ఇన్సిడెంట్లు. చిరంజీవి గారిని నేను ఎప్పుడూ సినిమా చేయమని అడగలేదు.. అడగను. కళ్యాణ్ లాంటి వాడికి ఒక సినిమా చేయాలని ఆయనకు అనిపిస్తే మంచిది. కానీ రామ్ చరణ్ చాలా గ్రేట్.. ఆయనే ముందుకు వచ్చి కలిసి సినిమా చేద్దాం అని అన్నారు. కానీ చాలా సినిమాలు లిస్ట్‌లో ఉండటంతో నేను మధ్యలో వెళ్లి దూరాలనుకోవడం లేదు. ఈరోజు సినిమా ఫీల్డ్‌లో ఎప్పుడు ఏ కాంబినేషన్ సెట్ అవుతుందో ఎవరికీ తెలియదు’ అంటూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు నిర్మాత సి. కళ్యాణ్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3uxJklF

No comments:

Post a Comment

'I Feel I Fail Shah Rukh'

'I'm happy piggybacking on his stardom.' from rediff Top Interviews https://ift.tt/b1euMKc