Saturday, 29 May 2021

సినిమా రౌండప్: నందమూరి ఫ్యాన్స్ కోసం ఇదీ బాలయ్య బాబు స్కెచ్.. ఎన్టీఆర్ మార్క్! హీరోయిన్ టెన్షన్‌

ఆ ప్రదేశంలో టెన్షన్ యంగ్ హీరోయిన్ రాశి ఖన్నా తన కొత్త సినిమా 'థాంక్యూ' షూటింగ్ అనుభవాలను పంచుకుంది. నాగ చైతన్య హీరోగా రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కోసం ఇటీవలే ఇటలీ వెళ్ళొచ్చింది చిత్రబృందం. త్వరగా షూటింగ్ ఫినిష్ చేయాలని చాలా పెద్ద రిస్క్ చేశామని, ఇటలీ వెళ్లినప్పటికీ అందరిలోను టెన్షన్ ఉందని రాశి ఖన్నా చెప్పింది. కొన్ని లొకేషన్స్‌లో కరోనా కేసులు బయటపడటంతో మరింత టెన్షన్ పడ్డామని, ఎలాగోలా షూటింగ్ ఫినిష్ అయ్యాక హమ్మయ్య అనుకున్నామని చెప్పుకొచ్చింది. పెళ్లి తర్వాత కాజల్ స్పీడ్ ‘పేపర్‌బాయ్‌’ సినిమాతో తెలుగు తెరపై తన మార్క్ చూపించిన జయశంకర్‌ దర్శకత్వంలో కాజల్ ఓ సినిమా చేయబోతోందట. థ్రిల్లింగ్‌ కథతో హీరోయిన్ ఓరియెంటెడ్ మూవీగా ఈ సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురాబోతున్నారట. కాజల్‌కి స్క్రిప్ట్‌ నచ్చడంతో ఆమె వెంటనే ఓకే చెప్పిందని సమాచారం. యంగ్ టైగర్ న్యూ ఫీట్ నందమూరి వారసుడిగా సినీ ఎంట్రీ ఇచ్చి టాలీవుడ్ టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచారు యంగ్ టైగర్ . వరుస హిట్స్‌తో సత్తా చాటుతున్న ఆయన తాజాగా ఓ అరుదైన మైలురాయిని అధిగమించారు. సోషల్ మీడియాలో తోటి హీరోలతో పోల్చితే అంతగా యాక్టివ్ కాకపోయినా.. కేవలం అయాన్ ఇమేజ్ తోనే ట్విట్టర్‌లో 5 మిలియన్ ఫాలోవర్ల మార్కు దాటారు ఎన్టీఆర్. అతి తక్కువ ట్వీట్లు చేసి ఐదు మిలియన్ల ఫాలోవర్లను దక్కించుకున్న హీరోగా ఆయన సరికొత్త రికార్డు నెలకొల్పారు. బాలయ్య బాబు భలే స్కెచ్చేశారే! సీనియర్ హీరో నందమూరి బాలకృష్ణ సినిమాల స్పీడు ఎలా ఉందో చెప్పాల్సిన పనిలేదు. ప్రస్తుతం బోయపాటి శ్రీనుతో 'అఖండ' మూవీ చేస్తున్న ఆయన గోపీచంద్ మలినేని దర్శకత్వంలో మరో సినిమా చేయబోతున్నారు. తన రాబోయే పుట్టిన రోజు (జూన్ 10)న ఈ రెండు సినిమాల నుంచి అభిమానుల కోసం భారీ సర్‌ప్రైజ్‌లు సిద్ధం చేయాలని చెప్పారట బాలయ్య. అతనితో అనుప‌మ ఎంజాయ్ త‌న సోద‌రుడు అక్ష‌య్ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌తో సరదాగా ఎంజాయ్ చేసింది హీరోయిన్ అనుప‌మ ప‌ర‌మేశ్వ‌ర‌న్‌. సోదరుడి ప్రేమతో పొందిన ఆనందాన్ని ఫొటోల్లో బంధించి ఈ ఫొటోస్‌ని సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది ఈ యంగ్ హీరోయిన్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2TsSBid

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....