Saturday, 29 May 2021

హాట్ బ్యూటీకి అరుదైన గౌరవం.. ఓ కన్నేసి ఉంచండంటోన్న గుంజన్

గురించి తెలియని వారెవ్వరూ ఉండరు. Wife,I అనే సినిమాతో అందాలను ఆరబోసి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇక ఆమె నటన ఎంత బోల్డ్‌గా ఉందో.. మాటలు మరింత పచ్చిగా ఉంటాయి. మొహమాటమేమీ లేకుండా అన్ని విషయాల గురించి ఇంటర్వ్యూలో ఆమె చెప్పిన తీరుకు అంతా షాక్ అయ్యారు. అంతే కాకుండా ఇంటర్వ్యూలో మధ్యలోనే షర్ట్ విప్పేసి కూర్చోవడం అప్పట్లో తెగ కాంట్రవర్సీ అయింది. అలాంటి బ్యూటీ సోషల్ మీడియాలో ఇంకెలా రెచ్చిపోతుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. పోర్న్ సినిమాలకు, బూతు సినిమాలకు ఎలాంటి బేధాలున్నాయని, తనను పోర్న్ స్టార్ అంటున్నారు కానీ అది నిజం కాదంటూ ఎంతో క్లియర్‌గా వివరించారు గుంజన్. అలాంటి గుంజన్ తాజాగా ఓ బుక్ కవర్ పేజీ మీద ప్రత్యక్షమైంది. ఇంత వరకు ఏ నటికి కూడా ఇలాంటి గౌరవం దక్కలేదని గుంజన్ చెబుతున్నారు. దర్పన్ గోయల్ అనే అంతర్జాతీయ రచయిత్రి రాస్తోన్న డయాబోలిక్యూ అనే పుస్తకంపై గుంజన్ కనిపించబోతోన్నారు. దీనిపై గుంజన్ మాట్లాడుతూ.. ఈ ప్రాజెక్ట్‌కు నేను ఎందుకు ఓకే చెప్పానంటే వారు నన్ను సహజంగా చిత్రీకరించారు. అది కేవలం నాకోసమే వచ్చినట్టు అనిపించింది.. అంతే కాకుండా అది ప్రతీ ఒక్క అమ్మాయికి సంబంధించిన విషయం అని అనిపించింది.. త్వరలోనే మీ ముందుకు రాబోతోన్నాను.. ఇంకా ఎక్కువ విషయాలు తెలుసుకోవాలని అనుకుంటున్నారా?.. అయితే నా మీద ఓ కన్నేసి ఉంచండి అని అన్నారు. చివరగా గుంజన్.. డెడ్లీ అఫైర్ అనే సినిమాతో పలకరించారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yLE3dI

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....