Saturday 29 May 2021

చిరంజీవి గారే ఎందుకు సాయం చేయాలి?.. మీకు కాళ్లూ చేతులూ లేవా? ఆట సందీప్ షాకింగ్ కామెంట్స్

కరోనా కష్ట కాలంలో మెగాస్టార్ ఆపద్బాంధవుడిలా నిలిచారు. సీసీసీ ద్వారా సినీకార్మికుల‌ను ఆదుకున్న మెగాస్టార్ చిరంజీవి.. తెలుగు రాష్ట్రాల్లోని ప్రతి జిల్లాలో ఆక్సిజ‌న్ ఉత్ప‌త్తి ప్లాంట్స్ ఏర్పాటు పూనుకున్నారు. అయితే కాయలు ఉన్న చెట్టుకే రాళ్లదెబ్బలు అన్నట్టుగా.. చిరంజీవి సాయం చేస్తున్నప్పటికీ ఆయనపై విమర్శలు వెల్లువెత్తున్నాయి. బాలీవుడ్ నటుడు సోనుసూద్‌తో పోల్చుతూ నోటికొచ్చినట్టు మాట్లాడుతుండటంతో ఆయన అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇండస్ట్రీలో ఇంతమంది హీరోలు ఉండగా.. సాయం చేయడానికి ముందుకు వచ్చిన మెగాస్టార్‌‌ని టార్గెట్ చేయడం ఎంత వరకూ న్యాయం అని ప్రశ్నిస్తున్నారు ఆయన అభిమానులు. ఈ నేపథ్యంలో ప్రముఖ కొరియోగ్రాఫర్, చిరంజీవి అభిమాని కీలక వ్యాఖ్యలు చేశారు. అసలు చిరంజీవి ఎందుకు సాయం చేయాలంటూ విమర్శించేవాళ్లని నిలదీశారు. ఆయన మాట్లాడుతూ.. ఇండస్ట్రీలో ఇంతమంది ఉండగా.. ఎందుకు చిరంజీవి గారే సాయం చేయాలి.? ఆయన కూడా మనలాగే ఒక వ్యక్తి. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి.. ఇండస్ట్రీకి మెగా ఫ్యామిలీ వృక్షాన్ని ఇచ్చారు. మా తాత గారు ఇట్లా.. మా నాన్న గారూ ఇట్లా అని చెప్పుకుంటారు.. ఎందుకంటే వాళ్లు కష్టపడ్డారు.. వాళ్లలా నువ్వూ కష్టపడు. ఏ ఇష్యూ వచ్చినా ఇండస్ట్రీలో ఫస్ట్ రెస్పాండ్ అయ్యేది చిరంజీవి గారు. ఫస్ట్ బ్లడ్ బ్యాంక్ పెట్టింది.. ఎవరు?? ఆయనలా ఎవరు చేశారు.. ఎంతమంది బ్లడ్ బ్యాంక్‌లు పెట్టారు? ఐ బ్యాంక్ ఎప్పుడు పెట్టారు.. ఎంతమందికి సాయం చేశారు.. చేస్తున్నారు. ఇవన్నీ పక్కన పెట్టేద్దాం.. అసలు చిరంజీవి గారు ఎందుకు సాయం చేయాలి?? నీకు కాళ్లు ఉన్నాయి.. చేతులు ఉన్నాయి.. నీ బతుకు నువ్వు బతకలేవా? అయినా కష్టం అని వస్తే లేదనకుండా సాయం చేస్తారు చిరంజీవి గారు. ఇంత చేస్తున్నా ఆయన్నే ఎందుకు ప్రశ్నిస్తున్నారు? ఏ చిరంజీవిగారు ఇంట్లో చేపలు కూర వండుకుంటే మీకేంటి నష్టం.. ఆయన చేపల కూర తినకూడదా? ఫ్యామిలీతో హ్యాపీగా ఉండకూడదా? దేశంలో ఏ మూల ఏది జరిగినా ఆయనే స్పందించాలా? దానికి గవర్నమెంట్ ఉంది.. చిరంజీవి గారు చేయాలనుకుంటే చేస్తారు. ఆయన్ని విమర్శించే వాళ్లు పనిపాటా లేకుండా ఖాళీగా ఉన్న వాళ్లే. పావలా శ్యామల కష్టంలో ఉందంటే ఇదివరకే ఆయన రూ.2 లక్షలు ఇచ్చారు. మళ్లీ ఇప్పుడు లక్ష సాయం చేశారు. నేను కూడా నా ఫేస్ బుక్‌లో ఫండ్ రైజ్ చేశా.. చాలామంది మీడియా వాళ్లు డబ్బులు సాయం చేసి ఆవిడతో ఇంటర్వ్యూలు చేశారు. ఆ తరువాత ఆవిడ బాగానే ఉంది. కానీ ఈ మధ్య ఆవిడ ఆర్థిక పరిస్థితి బాగోలేదని వీడియోలో చూశాం. ఆ విషయం చిరంజీవి గారికి తెలియదు అని అనుకోవచ్చు కదా.. ఇండస్ట్రీలో ఎవరు ఎలా ఉన్నా చిరంజీవి గారే చూసుకోవాలా? ’’ అంటూ చిరంజీవిని విమర్శించే వారికి గట్టి కౌంటర్ ఇచ్చారు ఆట సందీప్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fWwEPX

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz