Sunday, 30 May 2021

అక్కడ జరిగేదంతా అదే.. ఇండస్ట్రీపై ఇలియానా సంచలన వ్యాఖ్యలు

టాలీవుడ్‌లో ఒకప్పుడు టాప్ హీరోయిన్‌గా దూసుకుపోయారు. మొదటి చిత్రం దేవదాస్‌తోనే ఈ గోవా బ్యూటీ తెలుగు ప్రేక్షకులను కట్టిపడేశారు. ఆ తరువాత పోకిరి సినిమాతో టాప్ హీరోయిన్‌గా సత్తాను చాటారు. అలా టాలీవుడ్ నెంబర్ వన్ హీరోయిన్ అయ్యాక బాలీవుడ్ బాట పట్టారు. కానీ అక్కడ సరైన సక్సెస్ చవిచూడలేకపోయారు. ఆ తరువాత మళ్లీ టాలీవుడ్ వైపు ప్రయత్నాలు మొదలుపెట్టారు. కానీ ఇక్కడా వర్కవుట్ కాలేదు. దేవుడు చేసిన మనుషులు, అమర్ అక్బర్ ఆంటోనీ అంటూ డిజాస్టర్లతో ఇలియానా ఫేడవుట్ అయిపోయారు. అలా మళ్లీ తిరిగి బాలీవుడ్‌కే వెళ్లారు. కానీ ఇంత వరకు ఇలియానాకు ఒక్కటంటే ఒక్క బ్లాక్ బస్టర్ హిట్ పడలేదు. దీంతో వెండితెర మీద అంతగా అవకాశాలు లేకపోవడంతో సోషల్ మీడియాలో ఈ అమ్మడు రచ్చ చేయడంప్రారంభించారు. ఇక ప్రియుడితో బ్రేకప్ అవ్వడం, గ్యాప్ తీసుకోవడంతో కూడా ఇలియానా వెనకబడింది. ఇలియానా చివరగా ది బిగ్ బుల్ అనే సినిమాలో నటించారు. కానీ అనుకున్నంతగా ఆకట్టుకోలేకపోయారు. అయితే ఇలియానా తాజాగా సినీ పరిశ్రమ గురించి సంచలన కామెంట్లు చేశారు. ఇండస్ట్రీ చాలా ఘోరమైంది.. ఇక్కడ టాలెంట్ ఎంత ఉన్నా పనికి రాదు. జనాలు మమ్మల్ని చూసినంత వరకు మాకు చాన్స్‌లు వస్తుంటాయి.. వారు మా సినిమాలను చూడటం మానేస్తే మా పని అయిపోయినట్టే. అయినా మన జీవితంలో అన్నీ కూడా మనకు నచ్చినట్టే జరగవంటూ వేధాంత ధోరణిలో మాట్లాడేశారు. పర్సనల్ లైఫ్, ప్రొఫెషనల్ లైఫ్‌ను బ్యాలెన్స్ చేయడం చాలా కష్టమైన పని.. అయితే నా విషయానికి వస్తే.. ప్రొఫెషనల్ లైఫ్ కంటే పర్సనల్ లైఫ్‌కే ఎక్కువగా ప్రాముఖ్యతను ఇస్తాను అని ఇలియానా చెప్పుకొచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vyUTuc

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....