
మాజీ మంత్రి రాసలీలల బాగోతాన్ని బట్టబయలు చేసింది సినీ . తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించి మోసం చేసి.. గత ఐదేళ్లుగా శారీరంగా వాడుకుంటూ ఇప్పుడు పెళ్లి చేసుకోమని అడిగితే నీ దిక్కున్న చోట చెప్పుకోమని బెదిరిస్తున్నాడంటూ మాజీ మంత్రిపై తీవ్ర ఆరోపణలు చేసింది నటి చాందిని. తమిళనాడుకి చెందిన మాజీ మంత్రి మణికందన్ తనను పెళ్లి చేసుకుంటానని నమ్మించి అన్ని విధాలా వాడుకున్నాడంటూ చెన్నై పోలీసులకు ఫిర్యాదు చేసింది నటి చాందిని. తనతో రహస్యంగా ఐదేళ్లుగా కాపురం చేస్తున్నాడని.. తనని శారీరకంగా పీల్చి పిప్పి చేసి ఇప్పుడు ముఖం చాటేస్తున్నాడని తనకి న్యాయం చేయాలని పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది నటి. నోమాడ్స్ చిత్రంతో క్రేజ్ దక్కించుకున్న మలేషియా నటి చాందిని.. ఓ ప్రైవేట్ ఈవెంట్‌లో మంత్రిగారితో పరిచయం ఏర్పడగా.. అది సహజీవనానికి దారితీసింది. గత ఐదేళ్లుగా పెళ్లి చేసుకుంటానని చెప్తూ తనతో కాపురం చేస్తున్నాడని.. అయితే ఎంతకాలం ఇలా అని అడిగేసరికి ఇప్పుడు పెళ్లికి నో చెప్తున్నాడంటూ తీవ్ర ఆరోపణలు చేసింది చాందిని. తన మీద మోజు తీరిపోవడం పెళ్లికి నిరాకరిస్తున్నాడని.. పెళ్లి చేసుకుంటావా లేదా అని నిలదీసినందుకు ఇద్దరం ఏకాంతంగా గడిపిన అశ్లీల వీడియోలను సోషల్ మీడియాలో పెట్టిస్తా అని బెదిరిస్తున్నాడని.. రౌడీలతో దాడి చేయించడానికి ప్రయత్నిస్తున్నాడంటూ చెన్నై సిటీ పోలీసు కమీషనర్ కార్యాలయంలో ఫిర్యాదు చేసింది చాందిని. కాగా తమిళనాడులోని రామాథపురం నియోజకవర్గం నుంచి ఎమ్మెల్యేగా గెలిచిన మణికందన్.. జయలలిత సీఎంగా ఉన్న టైంలో ఐటీ శాఖామంత్రిగా పనిచేశారు. అయితే జయలలిత మరణం తరువాత చిన్నమ్మకి ముఖ్య అనుచరుడిగా మారాడు. ప్రస్తుతం ఈ మాజీ మంత్రిగారి రాసలీలలు ఇష్యూ తమిళనాట హాట్ టాపిక్ అవుతన్నాయి.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3yWPQ9c
No comments:
Post a Comment