Saturday 29 May 2021

లాక్‌డౌన్‌తో కలకి బ్రేక్‌లు పడ్డా.. స్నేహితులతో కలసి పేదలకు అన్నం పెడుతున్న యంగ్ డైరెక్టర్

ఇతరులకు మంచి చేయాలని చాలా మంది అనుకుంటారు. కానీ, కొద్ది మంది మాత్రమే దాన్ని ఆచరణలో పెడతారు. ఈ వీడియోలో కనిపిస్తున్న వ్యక్తి కూడా అలాంటివారే. పేరు . అప్‌కమింగ్ యంగ్ డైరెక్టర్. ఈయన మదిలో మొగ్గ తొడిగిన ఆలోచనకు తెలిసినవాళ్లు కూడా ఓకే చెప్పారు. వెంటనే అది కార్యరూపం దాల్చింది. కొంత డబ్బును సమకూర్చుకొని భోజనాలు తయారు చేయించారు. హైదరాబాద్ రోడ్ల వెంట తిరుగుతూ.. లాక్‌డౌన్‌తో ఇబ్బందులు పడుతున్న పేదలకు అన్నం పెట్టి, వారి కడుపు నింపారు. కరోనా మహమ్మారి విశ్వరూపం చూపిస్తున్న క్లిష్ట సమయంలో ఇంతకంటే గొప్ప సేవ ఏముంటుంది చెప్పండి. మల్లం శ్రీనివాస్ స్వస్థలం జనగామ జిల్లా బచ్చన్నపేట మండలం కొడవటూరు గ్రామం. పేదరికంలోనే పుట్టి పెరిగాడు. సినిమాలపై ఆసక్తితో హైదరాబాద్ నగరం వచ్చాడు. ఎన్నో కష్టాలను చూశాడు. అలాగని ఇప్పుడు బాగా సెటిలయ్యాడనుకుంటే పొరపాటే. తన సినిమా కలకు లాక్‌డౌన్ బ్రేకులు వేస్తే.. ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడు. అయినా, కుంగిపోలేదు. ఉన్నదాంట్లోనే ఇతరులకు సేవ చేయాలనేది శ్రీనివాస్ నైజం. అందుకే ఇతరులకు తోచినంత సాయం చేస్తున్నాడు. స్నేహితులు వెంకట్, తిరుపతి, రవి, ఉస్మాన్ కూడా ఆయనకు తోడయ్యారు. వంట చేసిపెట్టడానికి ఓ కుటుంబం కూడా ముందుకొచ్చింది. దీంతో వీరి పని మరింత తేలికైంది. అలాగని ఇది అంత తేలికేం కాలేదు. కొన్ని ఆటంకాలు ఎదురయ్యాయి. అయితే, తనదైన చొరవ, వాక్చాతుర్యంతో వాటిని ఇట్టే పరిష్కరించుకున్నారు శ్రీనివాస్. ముఖ్యంగా లాక్‌డౌన్ సమయంలో రోడ్ల వెంట తిరగడంలో వారికి ఇబ్బందులు ఎదురయ్యాయి. పోలీసులు అడ్డుకున్నారు. కానీ, ఈ పవిత్ర కార్యం గురించి తెలుసుకున్న తర్వాత పోలీసులు కూడా దయార్ధ్ర హృదయంతో వారిని అనుమతించారు. మంచి మనసుతో చేసే పనికి దేవుడు కూడా సహకరిస్తాడు కదా..! మల్లం శ్రీనివాస్ ఇంతకుముందు ‘నేను సీతాదేవి’ అనే సినిమాకు దర్శకత్వం వహించారు. ప్రస్తుతం ‘ఊరు-పట్నం సినిమా’ అనే చిత్రానికి డైరెక్షన్ చేస్తున్నారు. 80 శాతం షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాలో తన జీవితం, తనకు బాగా కావాల్సిన వారి జీవితాలకు సంబంధించిన అంశాలనే చూపెట్టబోతున్నారట. ఇటు పట్నం వారికి, అటు గ్రామస్థులకు ఈ సినిమా బాగా కనెక్ట్ అవుతుందని ఆయన విశ్వాసంగా చెబుతున్నారు.. ఈ లాక్‌డౌన్ సమయంలో మరింత ఎక్కువ మంది పేదలకు ఆహారం అందించడానికి మరికొన్ని రోజులు కృషి చేస్తామని ఆయన చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vx5c1Z

No comments:

Post a Comment

'Don't Involve My Family!'

'My weakness is my family, and the people I love.' from rediff Top Interviews https://ift.tt/2lOucDz