Sunday, 30 May 2021

ఎప్పటి నుంచో అలాంటి కోరిక ఉండేది.. అసలు గుట్టు విప్పిన నటి ప్రగతి

ఒకప్పుడు నటి అంటే ఓ రకమైన ఇమేజ్ ఉండేది. హీరోలకు తల్లి, అత్త పాత్రలు పోషించే ప్రగతి గుర్తుకు వచ్చేవారు. మోడ్రన్ మదర్ క్యారెక్టర్‌లకు ప్రగతి కేరాఫ్ అడ్రస్‌గా ఉండేవారు. కానీ ఇప్పుడు ప్రగతి పూర్తిగా మారిపోయారు. వర్కవుట్లతో నానా హంగామా చేస్తున్నారు. హీరోయిన్ రేంజ్‌లో ఫిట్ నెస్ మెయింటైన్ చేస్తున్నారు. ఇక వెరైటీ స్టెప్పులు వేస్తూ సోషల్ మీడియాను షేక్ చేస్తున్నారు. మరీ ముఖ్యంగా ఆమె ఈ వయసులో చేస్తున్న భారీ భారీ వర్కవుట్లు అందరినీ ఆశ్చర్యానికి గురి చేస్తుంటాయి. గత ఏడాది లాక్డౌన్ నుంచి ప్రగతి సోషల్ మీడియాను ఏలేస్తోన్నారు. గత ఏడాది నుంచి ప్రగతికి సోషల్ మీడియాలో క్రేజ్‌తో పాటు ఫాలోవర్లు పెరుగుతూనే వస్తున్నారు. ప్రగతి వేసే క్లాసికల్ స్టెప్పులు, లుంగీ కట్టి వేసే మాస్ డ్యాన్సులు ఎంతగా వైరల్ అయ్యాయో అందరికీ తెలిసిందే. ఇక నాలుగు పదులు వయసులోనూ వర్కవుట్లు చేసే తీరుకు అందరూ ఫిదా అవుతుంటారు.ఎంతో మంది మహిళల్లో ప్రగతి స్ఫూర్తిని నింపుతున్నారు. ఆమెను ఆదర్శంగా తీసుకుని ఎంతో మంది తమ ఆరోగ్యం, ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. తాజాగా ప్రగతి లైవ్‌లోకి వచ్చారు. తన అభిమానలతో ముచ్చట్లు పెట్టేశారు.వారు అడిగిన రకరకాల ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. ఇక ఆమెను ఓ నెటిజన్ అసలు ప్రశ్నను సంధించాడు. ఇంతలా వర్కవుట్ చేయడానికి ఎవరు ఇన్సిపిరేషన్ అని అడగడంతో ప్రగతి అసలు విషయం చెప్పేశారు. ఎప్పటినుంచో ఫిట్‌గా ఉండాలనే కోరిక ఉండేది.. కానీ గత రెండేళ్ల నుంచి ఎక్కువగా వర్కవుట్లు చేస్తున్నా.. ఒక్కసారి రిజల్ట్ చూశాక మనకే ఇంకా చేయాలని అనిపిస్తుంది.. నా ఎనర్జీ, ఫిట్ నెస్ బాగా పెరిగిపోయింది.. అలా నాక్కూడా బాగా అనిపిస్తుండటంతో వర్కువుట్లు చేస్తున్నాను అని ప్రగతి అన్నారు. ఇక చాలా మంది నెటిజన్లు ఆమె అందం మీద కామెంట్లు చేశారు. ఎంతో అందగా ఉన్నారు.. ఫిట్‌గా ఉన్నారు.. నవ్వు బాగుంది అంటూ ఇలా రెగ్యులర్ కామెంట్లు వచ్చాయి. దానికి ప్రగతి చిరునవ్వుతో థ్యాంక్యూ అంటూ బదులిచ్చారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3i5NLBI

No comments:

Post a Comment

'I Focused On Studying Charles Sobhraj'

'The opportunity to live as the Serpent excited me.' from rediff Top Interviews https://ift.tt/AtWXqwk