Saturday, 29 May 2021

ఏడేళ్ల తరువాత మళ్లీ అలా.. చేసే పని ఏం లేక అంటూ జగ్గూ భాయ్ సెటైర్స్

టాలీవుడ్‌లో ఒకప్పుడు ఫ్యామిలీ హీరోగా ఫుల్ ఫాంలో ఉండేవారు. కానీ ఇప్పుడు భయంకరమైన విలనిజాన్ని చూపిస్తూ అందరినీ భయపెట్టేస్తున్నారు. సైడ్ ఆర్టిస్ట్, సపోర్టింగ్ రోల్, హీరో ఫాదర్, విలన్‌గా ఇప్పుడు టాలీవుడ్‌లో దూసుకుపోతోన్నారు. జగ్గూ భాయ్ లేని సినిమా అంటూ విడుదలయ్యేది కాదు ఆ మధ్య. అయితే ఇప్పుడు మళ్లీ ఆయన కెరీర్ కాస్త స్లో అయింది. దీనికి తోడు కరోనా సెకండ్ వేవ్, లాక్డౌన్ వల్ల షూటింగ్‌లు అన్నీ కూడా క్యాన్సిల్ అయ్యాయి. దీంతో సెలెబ్రిటీలందరూ కూడా ఇంటి పట్టునే ఉంటున్నారు. ఈ క్రమంలో కొంత మంది కొత్త భాషలు నేర్చుకుంటున్నారు. ఇంకొంత మంది సినిమాలు చూస్తూ కాలక్షేపం చేస్తున్నారు. మరి కొంత మంది తమ ఫిట్ నెస్ మీద దృష్టి పెడుతున్నారు. అయితే జగ్గూ భాయ్ మాత్రం తన రూపాన్ని మార్చేసుకున్నారు. దాదాపు ఏడేళ్ల తరువాత షేవింగ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. లెజెండ్ సినిమాతో జగ్గూ భాయ్ తన స్టైల్‌ను మార్చేశారు. గుబురు గడ్డం, పెప్పర్ సాల్ల్ లుక్కులో జగపతి దర్శనమిచ్చి షాకిచ్చారు. అప్పటి నుంచి జగపతి బాబు దాదాపు అదే లుక్కులో కనిపించారు. గడ్డంతో ఉన్న సినిమాలే ఎక్కువగా ఉన్నాయి. అయితే ఈ లాక్డౌన్‌లో చేసే పని ఏం లేక ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నట్టు తన మీద తానే జగ్గూ భాయ్ సెటైర్ వేసుకున్నారు. నా గడ్డం చూస్తేనే నాకు పని లేదని తెలిసిపోతుంది.. దాదాపు ఏడేళ్ల తరువాత ఇలా క్లీన్ షేవ్ చేసుకున్నానని జగ్గూ భాయ్ చెప్పుకొచ్చారు. ఈ మధ్యే రజినీకాంత్ అన్నాత్తె సినిమా కోసం అదిరిపోయే లుక్కును ట్రై చేసినట్టు జగపతి బాబు పేర్కొన్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fZog2u

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....