Wednesday 26 May 2021

సినిమా రౌండప్: ఆలోచనలో పడిన రాఘవేంద్ర రావు.. మేజర్ ప్లాన్ చేంజ్.. మహేష్ ఫ్యాన్స్‌కి బ్యాడ్ న్యూస్

'పెళ్లి సందD' కూడా అక్కడే.. ఎప్పుడైతే థియేటర్స్ మూతపడ్డాయో అప్పటినుంచి మళ్ళీ ఓటీటీ హవా పెరిగింది. దీంతో పలు కొత్త సినిమాల దర్శకనిర్మాతల చూపు అటువైపు పడుతోంది. దర్శకేంద్రుడు రాఘవేంద్ర రావు దర్శకత్వ పర్యవేక్షణలో రూపొందుతున్న 'పెళ్లి సందD' షూటింగ్ చివరిదశకు చేరుకోవడంతో ఓటీటీల నుంచి భారీ ఆఫర్స్ వస్తున్నాయట. దీంతో రాఘవేంద్ర రావు ఆలోచనలో పడ్డారని సినీ వర్గాల సమాచారం. వెనక్కి తగ్గిన 'మేజర్' మేజర్ సందీప్ ఉన్నికృష్ణన్ జీవితచరిత్ర ఆధారంగా అడవి శేష్ హీరోగా రూపొందుతున్న 'మేజర్' మూవీ విడుదలను వాయిదా వేశారు. జూలై 2వ తేదీన విడుదల చేయాలనుకున్న ఈ సినిమాను కరోనా కారణంగా వాయిదావేయక తప్పలేదు. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్ ప్రకటిస్తామని చెప్పారు మేకర్స్. కీర్తి సురేష్ సూపర్ ఛాన్స్ సౌత్ ఇండియన్ తెరపై ‘మహానటి’ కీర్తి సురేష్ హవా నడుస్తోంది. జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్న ఆమెకు వరుస ఆఫర్స్ వస్తున్నాయి. ప్రస్తుతం మహేష్ బాబు 'సర్కారు వారి పాట' సినిమాలో నటిస్తున్న ఆమె.. వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందనున్న కోలీవుడ్ మూవీలో ఛాన్స్ పట్టేసిందట. ఈ సినిమాలో విజయ్‌ హీరోగా నటించనున్నారు. వరుణ్ తేజ్ 'గని' కీలక అప్‌డేట్ కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో మెగా వారసుడు వరుణ్ తేజ్ హీరోగా రూపొందుతున్న సినిమా 'గని'. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమా కోసం వరుణ్ తేజ్ విదేశాలకు వెళ్లి మరీ బాక్సింగ్ శిక్షణ పొందారు. అయితే త్వరలో షూట్ చేయబోయే యాక్షన్ ఎపిసోడ్స్ కోసం భారీ ప్లాన్ చేశారట మేకర్స్. హాలీవుడ్ యాక్షన్ సినిమాలకు పనిచేసిన లార్నెల్ స్టోవల్ - లాడ్ రింబర్ నేతృత్వంలో ఈ సీన్స్ షూట్ చేయబోతున్నారట. మహేష్ బాబు అభిమానులకు బ్యాడ్ న్యూస్ ఈ నెల 31న సూపర్ స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా.. మహేష్ బాబు లేటెస్ట్ మూవీ 'సర్కారు వారి పాట' మూవీ ఫస్ట్‌లుక్ రిలీజ్ చేస్తారంటూ జోరుగా ప్రచారం జరిగింది. అయితే అలాంటిదేమీ లేదని తేల్చేసింది చిత్రయూనిట్. ప్రస్తుతం కోవిడ్ విజృంభణ నేపథ్యంలో ఫస్ట్ లుక్‌ను విడుదల చేయడం లేదని చిత్రబృందం అధికారికంగా ప్రకటించింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3vqxQS9

No comments:

Post a Comment

'Varun's Citadel Character Is Bambaiya'

'I would think a hundred times before I wrote a gay character or a mentally challenged character because it requires a lot of research a...