
ఆ హీరో ఎనర్జీ చాలా ఎక్కువ బాలీవుడ్ స్టార్ రణ్‌వీర్ సింగ్‌తో కలిసి ‘సర్కస్’ మూవీలో నటిస్తున్న .. ఆయన గురించి మాట్లాడుతూ పలు విషయాలు చెప్పింది. రణ్‌వీర్ చాలా తెలివైన వాడని, దేన్నీ అంత సులువుగా వదిలిపెట్టడని చెప్పుకొచ్చింది. ఆయన ఎనర్జీ లెవల్స్ చాలా ఎక్కువని, కొన్నిసార్లు రణ్‌వీర్‌లా ఉండాలనిపిస్తుందని చెప్పుకొచ్చింది. '' క్లారిటీ నాచురల్ స్టార్ నాని- శివ నిర్వాణ కాంబోలో రూపొందుతున్న 'టక్ జగదీష్' మూవీ రిలీజ్ గురించి వస్తున్న వార్తలపై క్లారిటీ ఇచ్చింది చిత్రయూనిట్. ఈ సినిమా ఓటీటీలో విడుదల కానుందని షికారు చేస్తున్న వార్తల్లో నిజం లేదని, థియేటర్లలోనే విడుదల కానుందని స్పష్టం చేసింది. రజినీకాంత్ కోరిక సీనియర్ హీరో రజినీకాంత్ ప్రస్తుతం ‘అన్నాత్తే’ మూవీ చేస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ పూర్తయిన సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కోరిక బయటపెట్టారు. ఇప్పుడే తనకు సినిమాల నుంచి వైదొలగాలని లేదని, మరికొన్ని సినిమాల్లో నటించాలనుందని తెలిపారు. ఇంట్లోనే హాట్ యాంకర్ల రచ్చ శ్రీముఖి, విష్ణు ప్రియ కలిశారంటే ఆ రచ్చ మామూలుగా ఉండదు. సమయం దొరికిన ప్రతిసారి డాన్సులేస్తూ ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ ఇస్తుంటారు ఈ బుల్లితెర హాట్ యాంకర్స్. తాజాగా మరోసారి అలాగే చిందులేయడంతో ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రష్మీకి సూపర్ ఆఫర్ జబర్దస్త్ బ్యూటీ రష్మీకి నాగార్జున సినిమాలో నటించే అవకాశం దక్కిందని తెలుస్తోంది. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కుతున్న కొత్త సినిమాలో ఓ ముఖ్యపాత్ర కోసం ఆమెను సెలక్ట్ చేసినట్లు టాక్.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3utO2RA
No comments:
Post a Comment