Sunday, 2 May 2021

క్లాసిక్ కాంబో లేటెస్ట్ అప్‌డేట్.. త్రివిక్రమ్ కోసం మహేశ్ తన రూటు మార్చుకున్నారట!

సూపర్‌స్టార్ , మాటల మాంత్రికుడు కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా అని అభిమానులు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్నారు. ఎందుకంటే గతంలో వీరిద్దరు కలిసి చేసినా.. ‘అతడు’, ‘ఖలేజా’ సినిమాలు ఇరువురి కెరీర్‌లో క్లాసిక్ సినిమాలుగా నిలిచిపోయాయి. ఇప్పటికే టీవీల్లో ఈ సినిమాలు చూస్తూ.. ఎంజాయ్ చేస్తారు ఫ్యాన్స్. దీంతో వీరిద్దరి కాంబోలో మరో క్లాసిక్ సినిమా గురించి వాళ్లు ఎదురుచూశారు. ఆ రోజు రానే వచ్చింది. మహేశ్-త్రివిక్రమ్ కాంబో హ్యాట్రిక్ సినిమా రానున్నట్లు శనివారం అధికారికంగా ప్రకటన వచ్చింది. దీంతో అభిమానుల సంబరాలు అంబరాన్ని తాకాయి. హారికా అండ్ హాసినీ క్రియేషన్స్ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాపై ఇప్పుటికే భారీగా అంచనాలు నెలకొన్నాయి. త్రివిక్రమ్ మహేశ్ బాబు కోసం ఎలాంటి కథ సిద్ధం చేస్తారా.. అని అభిమానులు ఉత్సుకతతో ఉన్నారు. ఈ నేపథ్యంలో మరో న్యూస్ సోషల్‌మీడియాలో వైరల్ అవుతుంది. త్రివిక్రమ్ శ్రీనివాస్ కోసం మహేశ్ బాబు తన రూటు మార్చుకున్నారట. సాధారణంగా మహేశ్ ఒక సినిమా పూర్తై విడుదల అయిన తర్వాతే మరో సినిమా షూటింగ్‌లో పాల్గొంటారు. కానీ, తొలిసారిగా మహేశ్ తన పద్దతి మార్చుకొని త్రివిక్రమ్ సినిమా షూటింగ్‌లో పాల్గొనే అవకాశం ఉందని వార్తలు వినిపిస్తున్నాయి. ఇక సూపర్‌స్టార్ కృష్ణ పుట్టినరోజు సందర్భంగా మే 31న ఈ సినిమాకు సంబంధించి మరిన్ని అప్‌డేట్స్ తెలిసే అవకాశం ఉంది. ‘అలవైకుంఠపురములో’ సినిమాతో గ్రాండ్ సక్సెస్ అందుకున్న త్రివిక్రమ్.. పవన్‌కళ్యాణ్, రానా కలిసి చేస్తున్న మల్టీస్టారర్ సినిమాకి స్క్రీన్‌ప్లే అందిస్తున్నారు. మరోవైపు మహేశ్.. ‘గీతగోవిందం’ ఫేమ్ పరశురామ్ దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే సినిమా చేస్తున్నారు. కరోనా కారణంగా ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడింది. త్వరలో మహేశ్ బాబు.. దర్శకధీరుడు ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gVCy64

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....