Sunday, 2 May 2021

ఎవ్వరినీ అలా చేయనివ్వను.. ముద్దుతో ప్రేమను బయట పెట్టేసిన రష్మిక మందాన్న

మందాన్నకు ఓ చిట్టి చెల్లి ఉందన్న విషయం తెలిసిందే. ఆ ఇద్దరూ అక్కాచెల్లెళ్ల మధ్య అంత గ్యాప్ ఉండటంపై ఆ మధ్య కాస్త సెటైర్లు పడ్డాయనుకోండి. అయితే రష్మిక తన చిట్టిచెల్లెలిపై అంతులేని ప్రేమను కురిపిస్తుంటారు. ఎప్పుడూ కూడా ఆమెను మిస్ అవుతున్నానంటూ పోస్ట్‌లు పెడుతుంటారు. అలా రష్మిక చిట్టి చెల్లెలు కూడా సోషల్ మీడియాలో అందరికీ సుపరిచితురాలే. అయితే ఇంట్లో ఉంటే తన చెల్లితో రష్మిక ఎంత అల్లరి చేస్తుంటుందో అందరికీ తెలిసిందే. ఆదివారం వస్తే చాలు ఇంట్లో వారంతా ఎలా ఎంజాయ్ చేస్తామో అంటూ రష్మిక పోస్ట్ ద్వారా చెబుతుంటారు. అయితే రష్మిక తన ఇంటిని చూడక, ఇంట్లో వాళ్ల దగ్గరికి వెళ్లక చాలా రోజులు అవుతుందట. ఈ విషయాన్ని రష్మిక ఈ మధ్యే బయటపెట్టేశారు. షూటింగ్‌లతో బిజీగా ఉండటం వల్ల ఇంటికి వెళ్లక మూడు నాలుగు నెలలు అవుతోందని రష్మిక వివరించారు. నేడు రష్మిక చెల్లి బర్త్ డే. ఈ సందర్భంగా తన చిట్టి సోదరిని ఎంతో మిస్ అవుతున్నట్టున్నారు రష్మిక. ఈ మేరకు ఆమె షేర్ చేసిన ఫోటో, పోస్ట్ రెండూ వైరల్ అవుతున్నాయి. చెల్లి నడుము మీద ముద్దు పెట్టేసి ఉన్న ప్రేమనంతా కురిపించేశారు. ఈ ప్రపంచంలో ఎవ్వరూ కూడా నిన్ను బాధపెట్టనివ్వకుండా నేను చూసుకుంటాను.. నిన్ను ఎంతగానో మిస్ అవుతున్నాను.. పరిస్థితులన్నీ చక్కబడ్డాక నేను ఇంటికి వస్తాను.. మనం ఫుల్ పార్టీ చేసుకుందాం అంటూ రష్మిక తన సోదరిని ఓదార్చే ప్రయత్నం చేశారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3tblhsi

No comments:

Post a Comment

'Indian Bank Aims For Rs 25 Trl Business By Dec 2030'

'In the last one year, we have added more than Rs 1.7 trillion, and we are on track.' from rediff Top Interviews https://ift.tt/tN...