Sunday, 2 May 2021

నా జీవితంలో ఇక దానికి చోటు లేదు.. బండ్ల గణేష్ సెన్సేషనల్ కామెంట్స్

ప్రస్తుతం సినిమా పరిశ్రమకు చెందిన వ్యక్తిగానే గుర్తించబడాలని అనుకుంటున్నారు. రాజకీయ అంశాలకు బండ్ల గణేష్ దూరంగా ఉంటున్నారు. బండ్ల గణేష్ కెరీర్‌లో రాజకీయాలు అచ్చిరాలేదు. పాలిటిక్స్‌లోకి వచ్చి బండ్ల గణేష్ ఇమేజ్ డ్యామేజ్ చేసుకున్నారు. 2018 ఎన్నికల్లో బండ్ల గణేష్ ఏ స్థాయిలో రెచ్చిపోయారో అందరికీ తెలిసిందే. పొలిటికల్ కారిడార్‌లో బండ్ల గణేష్ చివరకు జోకర్‌గా మిగిలిపోయారు. సినీ ఇండస్ట్రీలో కమెడియన్, నిర్మాతగా ఓ స్థాయికి చేరుకున్న బండ్ల గణేష్.. రాజకీయాల్లోకి వచ్చి దారుణంగా అవమానాలకు గురయ్యారు. బ్లేడ్ గణేష్‌గా అందరితోనూ మాటలు అనిపించుకున్నారు. పీక కోసుకుంటాను అంటూ అతిగా మాట్లాడారు. అయితే రాజకీయాల్లోకి వచ్చి తప్పు చేశానని త్వరగానే అర్థం చేసుకున్నారు. అందుకే ఇప్పుడు పూర్తిగా సినిమాలపైనే దృష్టి పెట్టారు. కానీ మధ్యలో బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీపై ఏదో రకమైన వార్తలు వస్తూనే ఉంటాయి. అయితే అలా రూమర్లు వచ్చిన ప్రతీసారి సోషల్ మీడియాలో ఖండిస్తుంటారు. నెటిజన్లు చేసే ట్రోలింగ్‌లు, కామెంట్లకు స్పందిస్తూనే ఉంటారు. తాను ఏ రాజకీయ పార్టీల్లో చేరడం లేదని పలు మార్లు క్లారిటీ ఇస్తూనే వచ్చారు. అయితే తాజాగా మరోసారి బండ్ల గణేష్ పొలిటికల్ ఎంట్రీపై కామెంట్ చేశారు. నేడు దేశ వ్యాప్తంగా అసెంబ్లీ ఎన్నికల ఫలితాల జోరు కనిపించింది. పశ్చిమ బెంగాల్, తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లోని అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. మమతా బెనర్జీ పార్టీ దూసుకుపోతుండటంపై బండ్ల గణేష్ స్పందించారు. కంగ్రాట్స్ చెబుతూ బండ్లన్న చేసిన ట్వీట్‌పై ఓ నెటిజన్ వెరైటీగా స్పందించాడు. ఈ పార్టీలో చేరుతావా? అని కౌంటర్ వేయడంతో బండ్ల గణేష్ స్పందించాడు. నా జీవితంలో ఇక రాజకీయాలు అనేవి ఉండవు అంటూ క్లారిటీగా చెప్పారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3aZ0MJ4

No comments:

Post a Comment

'Markets Are Testing Investors' Patience'

'This is also a time when you realise that short-term trading and dabbling in derivatives may result in financial losses.' from re...