
దేశం మొత్తం ఎదురుచూసిన ఎన్నికల ఫలితాలు వెలువడ్డాయి. అందులో కొందరి అంచనాలు నెరవేరాయి. ఇంకొందరు బోల్తా పడ్డారు. మరొ కొందరికి మిశ్రమ ఫలితాలు దక్కాయి. కేరళ, పశ్చిమ బెంగాల్, తమిళనాడు, అస్సాం, పుదుచ్చెరి ఎన్నికల్లో ఎన్నో వింత ఘటనలు జరిగాయి. పార్టీ గెలిచి, అధినేత ఓడటం ఓ విశేషం అయితే.. సినీ ప్రముఖుల్లో కొందరు డిపాజిట్లు కూడా కోల్పోవడం విశేషం. అలా తమిళనాడు సినీ ప్రముఖులకు రాజకీయాల పరంగా వింత అనుభవాలు ఎదురయ్యాయి. తమిళనాడులో కమల్ హాసన్, ఉదయనిధి స్టాలిన్, సుందర్ పోటీచేశారు. అయితే ఇందులో ఉదయనిధి స్టాలిన్ మాత్రం నెగ్గారు. కమల్ హాసన్, కుష్బూలకు ఎదురుదెబ్బ తగిలింది. తమిళనాడులోని కోయంబత్తూరు దక్షిణ నియోజకవర్గం నుంచి మక్కల్ నీది మయ్యం పార్టీ తరపున పోటీ చేసి ఓడిపోయారు. డీఎంకే అధినేత స్టాలిన్ కుమారుడు చెపాక్ నియోజకవర్గం నుంచి పోటీ చేసి విజయం సాధించారు.తమిళనాడులోని థౌజండ్ లైట్స్ నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసి కుష్బూ పరాజయం పాలయ్యారు. కేరళలోని త్రిస్సూరు నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసి సురేష్ గోపి ఓటమి పాలయ్యారు. పశ్చిమ బెంగాల్లోని బనాకురా నియోజకవర్గం నుంచి టీఎంసీ తరపున సయంతిక బెనర్జీ పోటీ చేసి ఓడిపోయారు. పశ్చిమ బెంగాల్‌లోని చండీతాల నియోజకవర్గం నుంచి బీజేపీ తరపున పోటీచేసి యశ్ దాస్ గుప్తా ఓడిపోయారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3xEgNxD
No comments:
Post a Comment