Sunday, 2 August 2020

Sri Reddy: నువ్వు హాట్ మాత్రమే కాదు బాబోయ్! ఇంకా చాలా ఉంది.. సోనూ సూద్‌పై శ్రీ రెడ్డి కామెంట్స్

నిత్యం సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటూ నెటిజన్లకు హాట్ ట్రీట్ ఇస్తుండటం స్పెషాలిటీ. టాలీవుడ్‌లో క్యాస్టింగ్ కౌచ్ రాజ్యమేలుతోంది, సినీ ఇండస్ట్రీలో చీకటి కోణాలు బయటపెడతా అంటూ సంచలనం సృష్టించిన ఈ సుందరి ప్రస్తుతం చెన్నైలో మకాం పెట్టేసి తన సామాజిక మాధ్యమాల ద్వారా ప్రతీ ఇష్యూపై స్పందిస్తోంది. ఈ క్రమంలోనే తాజాగా.. మంచి పనులతో దేశవ్యాప్తంగా ప్రశంసలందుకుంటున్న సోనూ సూద్‌పై తనదైన శైలిలో కామెంట్స్ వార్తల్లో నిలిచింది శ్రీ రెడ్డి. కరోనా కారణంగా లాక్ డౌన్ విధించడంతో వలస కార్మికులకు, ఆర్ధిక స్థోమత లేక ఆకలిగా ఉన్న పేదవాడికి సమయానికి సాయం చేసి వారందరి పాలిట దేవుడయ్యారు సోనూ సూద్. లాక్ డౌన్‌తో రోడ్డునపడ్డ వలస కార్మికులకు ఇళ్లకు చేర్చడంతో మొదలైన సోనూ సాయం.. నేటికి కూడా కొనసాగుతూనే ఉంది. కష్టం ఎక్కడ ఉంటే అక్కడ సూపర్‌మేన్‌లా వాలిపోతూ కష్టాల్లో ఉన్నవారికి అండగా నిలుస్తున్న ఆయన అందరి చేత రియల్ హీరో అనిపించుకుంటున్నారు. Also Read: దీంతో సోనూ సూద్ చేస్తున్న సేవలు, ఆయన దాతృత్వాన్ని చూసి దేశం మొత్తం నీరాజనాలు పలుకుతోంది. అలాంటి సోనూ సూద్‌పై శ్రీ రెడ్డి మనసు పారేసుకున్నట్లుంది. గత కొన్ని రోజులుగా సైలెంట్‌‌గా ఉంటున్న శ్రీ రెడ్డి, తాజాగా వెళుతున్న తీరు, ఆపత్కాల సమయంలో ఆయన చేస్తున్న సేవలపై రియాక్ట్ అవుతూ 'లవ్ యూ' అనేసింది. సోనూ సూద్‌ ఫోటోను తన ఫేస్‌బుక్ ఖాతా ద్వారా షేర్ చేసిన శ్రీ రెడ్డి.. ''ఈయన కేవలం హాట్ మాత్రమే కాదు బాబోయ్.. మంచి హార్ట్ కూడా ఉన్నవాడు. మీరంటే ఎంతో ప్రేమ ఉంది. మీకు భవిష్యత్‌లో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నా సోనూ సూద్ గారు'' అంటూ ట్యాగ్ చేసింది. దీంతో ఈ పోస్ట్ తెగ వైరల్ అవుతూ నెటిజన్ల నుంచి భారీ స్పందన తెచ్చుకుంటోంది. 'ఫస్ట్ టైమ్ నీ నుంచి మంచి మాటలు రావడం చూశా' అంటూ శ్రీ రెడ్డిపై కామెంట్స్ వస్తున్నాయి. ఏదేమైనా సోనూ సూద్ దాతృత్వాన్ని చూసి శ్రీ రెడ్డి ఫిదా అయింది మాత్రం వాస్తవం అని తెలుస్తోంది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2ECEkb7

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....