Sunday, 9 August 2020

Rgv: తీవ్ర అనారోగ్యంతో రామ్ గోపాల్ వర్మ! డిజప్పాయింట్ చేస్తున్నా అనేశాడు బాబోయ్.. వెరీ డేంజరస్

ఈ ప్రపంచంలో దేన్నీ లెక్కచేయను అలాగని తప్పు చేయను.. నేను అనుకున్నదే చేస్తా, నా ఆలోచనలే నాకు బలం అంటూ ఓపెన్‌గా మాట్లాడే తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నారా? అంటే అవుననే అంటున్నాయి కొన్ని మీడియా వర్గాలు. కరోనాను సైతం లెక్కచేయకుండా వరుస సినిమాలు చేస్తున్న రామ్ గోపాల్ వర్మ కొన్ని రోజులుగా అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆయనకు కరోనా సోకిందా? లేదా మామూలు అనారోగ్యమేనా అనేది తెలియాల్సి ఉందంటూ వార్తలు వస్తున్నాయి. దీంతో ఈ వార్తలపై రియాక్ట్ అయిన వర్మ స్వయంగా ఓ వీడియో ద్వారా క్లారిటీ ఇచ్చారు. Also Read: చేతిలో డంబేల్ పట్టుకొని వర్కవుట్ చేస్తూ తన అనారోగ్యం పట్ల వస్తున్న వార్తలపై స్పందించారు వర్మ. ''నేను అనారోగ్యంగా ఉన్నానని, నాకు కోవిడ్ సోకిందేమో అనే అనుమానం కలుగుతోందని కొందరు సోషల్ మీడియాలో రూమర్స్ పుట్టిస్తున్నారు. వాళ్లందరినీ డిజప్పాటింట్ చేస్తూ, మీ సంతోషానికి చెక్ పెడుతూ నేను చెప్పేది ఒక్కటే.. ప్రస్తుతం నేను పూర్తి ఆరోగ్యంగా ఉన్నాను. వరుసపెట్టి ఇంట్రెస్టింగ్ సినిమాలు రూపొందిస్తున్నాను. సూపర్ ఫకింగ్ ఫైన్'' అన్నారు. దీంతో ఈ వీడియో చూసిన నెటిజన్స్ ఆర్జీవీ స్టైల్‌లోనే కామెంట్స్ చేస్తుండటం విశేషం. 'వర్మను చూస్తే కరోనా అయినా సరే పారిపోవాల్సిందే' అంటూ రియాక్ట్ అవుతున్నారు నెటిజన్లు. ఇటీవలే ‘పవర్ స్టార్’ మూవీతో వివాదాల్లో నిలిచిన రామ్ గోపాల్ వర్మ దాన్ని కంటిన్యూ చేస్తూ 'మర్డర్' మూవీ చేస్తున్నారు. ఈ సినిమా కూడా పలు వివాదాల్లో నిలుస్తూ ఫుల్లుగా ఫ్రీ ప్రమోషన్స్ రాబట్టుకుంటోంది. ఇదిలా ఉండగానే నిన్న (ఆగస్టు 9) ఇండియాలో తొలి లెస్బియన్ క్రైమ్ యాక్షన్ ఫిల్మ్ అంటూ మరో ఇంట్రెస్టింగ్ మూవీ ప్రకటించారు వర్మ. ఇది ఇద్దరు అమ్మాయిల మధ్య లవ్ స్టోరీ అని పేర్కొంటూ దానికి '' అనే ఆసక్తికర టైటిల్ డిసైడ్ చేసి పోస్టర్ వదిలారు. ఇందులో ‘బ్యూటీపుల్’ హీరోయిన్ నైనా గంగూలీ, ‘థ్రిల్లర్’ బ్యూటీ అప్సర రాణి లీడ్ రోల్స్ పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gK5HhA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....