Monday, 10 August 2020

Rgv: రామ్ గోపాల్ వర్మ బంపర్ ఆఫర్.. నేరుగా అప్సరా రాణితో ఎంజాయ్ చేసే ఛాన్స్ మీదే.. ఇక రచ్చ రచ్చే!!

సినిమాలు రూపొందించడం, ఆ సినిమాలను పైసా ఖర్చు లేకుండా ప్రమోట్ చేసుకోవడంలో రూటే సపరేటు. ఇతర దర్శకనిర్మాతలంతా సినిమా షూటింగ్ చేస్తూనే ప్రమోషన్స్ కోసం లక్షల్లో ఖర్చు చేస్తుంటే ఒక్క వర్మ మాత్రం రూపాయి కూడా ఖర్చుపెట్టకుండా కేవలం సోషల్ మీడియా కాంట్రవర్సీల ద్వారానే తన సినిమాలకు హైప్ తెచ్చుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఈ సారి తన లేటెస్ట్ మూవీ 'థిల్లర్' కోసం మరో డిఫరెంట్ ప్లాన్ చేశారు రామ్ గోపాల్ వర్మ. లాక్‌డౌన్ కారణంగా థియేటర్స్ మూతపడటంతో ఆన్‌లైన్ వేదికలకు డిమాండ్ పెరిగింది. ఓటీటీ, ఆన్‌లైన్ ప్లాట్‌ఫామ్స్‌పై సినిమాలు చూసేందుకు ఆసక్తి చూపుతున్నారు ఆడియన్స్. ఈ విషయాన్ని ముందుగానే గమనించిన వర్మ.. ఆర్జీవీ వరల్డ్ థియేటర్ ఓపెన్ చేసి ఆ వేదికపై వరుస సినిమాలు రిలీజ్ చేస్తున్నారు. ఇప్పటికే క్లైమాక్స్, నగ్నం లాంటి అడల్ట్ కంటెంట్ సినిమాలతో రచ్చ చేసిన వర్మ.. ఇప్పుడు అడల్ట్ కంటెంట్‌కి థ్రిల్లింగ్ అంశాలు జోడించి 'థ్రిల్లర్' మూవీ ద్వారా ప్రేక్షకుల ముందుకు రాబోతున్నారు. ఈ మూవీలో హీరోయిన్ అప్సర రాణి అందాల విందు, రొమాంటిక్ డోస్ పుష్కలంగా ఉండనుందని ఇప్పటికే పలు పోస్టర్స్ ద్వారా కన్ఫర్మ్ చేశారు. Also Read: ఇక ఈ సినిమా ఆగస్టు 14వ తేదీ రాత్రి 9 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించిన వర్మ.. ఆర్జీవీ వరల్డ్ థియేటర్, శ్రేయాస్ ప్లాట్‌ఫాంలలో ఈ మూవీ చూడొచ్చని, ఒక్కో వ్యూ కోసం 200 రూపాయలు చెల్లించాలని పేర్కొన్నారు. ఈ మేరకు టికెట్ బుకింగ్స్ షురూ చేసి తాజాగా ప్రేక్షకులను ఆకట్టుకునే ఓ బంపర్ ఆఫర్ ప్రకటించారు. ''వెంటనే థ్రిల్లర్ టికెట్స్ బుక్ చేసుకోండి. 20 మంది లక్కీ విన్నర్స్ అప్సరా రాణితో పాటు ఆర్జీవీని కలిసే ఛాన్స్ కొట్టేయండి'' అంటూ ఓ పోస్టర్ ద్వారా తెలిపారు. దీంతో హాట్ బ్యూటీ అప్సరతో ఇంటరాక్ట్ కావడం పట్ల ఆసక్తి చూపుతూ నేను రెడీ అంటే నేను రెడీ అంటూ పోటీపడుతున్నారు నెటిజన్లు. సిచువేషన్ క్యాష్ చేసుకోవడంలో వర్మ స్ట్రాటజీయే వేరని ఇంకొందరు అభిప్రాయపడుతున్నారు. సో.. ఏదేమైనా చూడాలి మరి ఏ 20 మందికి ఆ బోల్డ్ బ్యూటీని నేరుగా కలిసే అవకాశం దక్కుతుందో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gKJ7FG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....