Friday, 7 August 2020

MLA Roja: రోజా లేకుండానే జబర్దస్త్.. ఆమె స్థానంలో వచ్చిన జడ్జీపై హైపర్ ఆది డబుల్ మీనింగ్ డోస్

నవ్వులతో కామెడీ ప్రియుల్ని అలరించేందుకు ఈవారం జబర్దస్త్ ప్రోమో వచ్చేసింది. ఈటీవీలో ఆగష్టు 13న ప్రసారమయ్యే ఎపిసోడ్‌కి సంబంధించిన ప్రోమోను మల్లెమాల ఎంటర్ టైన్మెంట్స్ విడుదల చేశారు. తాజా ప్రోమోలో జబర్దస్త్ నవ్వుల మిస్ కావడం లోటుగా కనిపించింది. రోజా స్థానంలో శేఖర్ మాస్టర్ జబర్దస్త్ జడ్జీగా వచ్చారు. అయితే ఏపీలో రాజధాని ఇష్యూ హాట్ టాపిక్‌గా ఉన్న నేపథ్యంలో కీలకమైన భేటీల దృష్ట్యా రోజా జబర్దస్త్‌కి జబర్దస్త్‌కి బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. ఇక తాజా ప్రోమోలో హైపర్ ఆది చేతికి మల్లెపూలు పెట్టుకుని ఓ కొత్త జబర్దస్త్ పోరీతో మైండ్ బ్లాక్ మైండ్ బ్లాక్ అంటూ స్టెప్పులు వేస్తూ ఎంట్రీ ఇచ్చాడు. హైపర్ ఆది అంటే పంచ్‌లు పేలిపోవడంతో డబుల్ మీనింగ్ డోస్ అదే రేంజ్‌లో ఉంటుంది. ప్రతి వారం ఓ కొత్త మహిళా కంటెస్టెంట్స్ స్కిట్‌లోకి తీసుకువచ్చే హైపర్ ఆది ఈసారి మరో కొత్త కంటెస్టెంట్‌తో రచ్చ చేశాడు. ‘ఏమండీ.. ఆ ఇద్దర్నీ (మను, శేఖర్ మాస్టర్) చూశారా?? ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది’ అని ఆది వైఫ్‌గా చేసిన మహిళ మురిసిపోవడంతో.. ‘ఏమే.. మొగుడు మల్లెపూలు చేతికి చుట్టుకుని రెడీగా ఉంటే.. ఆయన దగ్గర ఆట ఉంది.. ఈయన దగ్గర పాట ఉంది అంటావా?? మరి నా దగ్గర ఏం లేదనా??’ అంటూ డబుల్ మీనింగ్ డైలాగ్ వదిలాడు. పరాయి పురుషుడ్ని చూస్తే మీకు జెలాసీ అని ఆమె అనడంతో.. ‘పర పురుషుడు అయితే ఓకేనే.. అక్కడ ఉన్నది శేఖర్ మాస్టర్.. పురుషులందు ఆ పురుషుడు వేరయా.. విశ్వదాభి రామా ఆయన కన్ను పడిందంటే నువ్ సేఫ్ కాదే భామా??’ అంటూ మరో పంచ్ వేశాడు. ‘ఈ అందం అంతా అడవి కాచిన వెన్నెల కావాల్సిందేనా’ అని తెగ ఇబ్బందిపడిపోవడంతో.. ‘నువ్ అలాంటి హింట్లు ఇవ్వకు.. అక్కడ ఆయన కాచుకుని కూర్చున్నాడు’ అంటూ శేఖర్ మాస్టర్‌ని ఓ ఆట ఆడుకున్నాడు హైపర్ ఆది. ఇక ఇదే స్కిట్‌లో అమ్రీష్ పురి వేషం వేసిన వ్యక్తిని ఉద్దేశించి.. ‘అమ్రీష్ పురి వాయిస్ గుండెల్లోనుంచి వచ్చినట్టు ఉంటుంది.. నీ వాయిస్ గు***అంటూ గరుబ్రహ్మ చేతితో బూతు సంజ్ఞ చేశాడు హైపర్ ఆది. ఇక ఎండిపోయిన జేజమ్మగా నటించి శాంతి స్వరూప్ పొట్ట చెక్కలు చేశాడు. ఇక రాకెట్ రాఘవ శేఖర్ మాస్టార్‌గా నటించి స్కిట్ చేయగా.. వెంకీ మంకీ స్కిట్ బాగా పేలినట్టే ఉంది. చివర్లో తాగుబోతు రమేష్.. ప్రకాష్ రాజ్‌లా మిమిక్రీ చేసే ప్రయత్నం చేయడం బాగానే వర్కౌట్ అయ్యింది. మొత్తానికి నవ్వుల రోజా లేకుండానే వచ్చేవారం జబర్దస్త్ ప్రసారం కావడం పంచ్‌లకు కాస్త లోటు అనే చెప్పాలి. అయితే శేఖర్ మాస్టర్ ఆ ప్లేస్‌ని భర్తీ చేయడానికి ఎంత ప్రయత్నించినా.. రోజా రేంజ్‌లో జబర్దస్త్ పంచ్‌లు ఇవ్వలేకపోయారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2XBjY92

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....