Monday, 17 August 2020

KGF 2: సంజయ్ దత్‌పై దాఖలైన పిటిషన్ కొట్టివేత.. హోకోర్టు తీర్పుతో కెజిఎఫ్-2కి లైన్ క్లియర్

కన్నడ స్టార్ యశ్ హీరోగా రూపొందుతున్న భారీ యాక్షన్ మూవీ కెజిఎఫ్-2లో బాలీవుడ్ స్టార్ సంజయ్ దత్ నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ చిత్రంలో 'అధీరా'గా సంజయ్ కనిపించనున్నారు. ఇటీవలే ఆయన క్రూరమైన లుక్‌ రిలీజ్ చేసి సినిమాపై అంచనాలు పెంచేసింది చిత్రయూనిట్. అయితే ఓ నిందితుడైన సంజయ్ దత్ సినిమాల్లో నటించడం ఏంటి? అంటూ ఓ వ్యక్తి కర్ణాటక హైకోర్టులో పిటిషన్ దాఖలు చేస్తూ సినిమా విడుదలను ఆపేయాలని కోరాడు. దీనిపై తాజాగా ఫైనల్ తీర్పు ఇచ్చింది హైకోర్టు. ముంబై బాంబు పేలుళ్ల కేసులో నిందుతుడిగా శిక్ష అనుభవించిన సంగతి తెలిసిందే. దీన్నే కారణంగా చూపుతూ ఓ నిందితుడు నటిస్తున్న సినిమాకు ప్రభుత్వం ఎలా అనుమతి ఇస్తుందని హుబ్లీకి చెందిన ఓ వ్యక్తి హైకోర్టులో పిటిషన్‌ దాఖలు చేశాడు. ఈ నేపథ్యంలో పిటిషన్‌పై జరిగిన అనేక వాదోపవాదాల అనంతరం సినిమా యూనిట్‌కి ఫేవర్‌గా హైకోర్టు తీర్పునిచ్చింది. ఒక సినిమాలో నటించడాన్ని నిషేధించిన చట్టాన్ని పిటిషనర్‌ తరఫున న్యాయవాది చూపించలేకపోవడంతో ప్రధాన న్యాయమూర్తి అభయ్ శ్రీనివాస్ ఓకా, జస్టిస్ అశోక్ ఎస్ కినాగీతో కూడిన డివిజన్ బెంచ్ సంజయ్ దత్‌పై దాఖలైన పిటిషన్‌ను కొట్టివేసింది. దీంతో కేజీఎఫ్ 2 విడుదలకి లైన్ క్లియర్ అయింది. Also Read: ‘కెజిఎఫ్’ చిత్రానికి కొనసాగింపుగా ‘కెజిఎఫ్-2’ తెరకెక్కుతోంది. ప్ర‌శాంత్ నీల్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న భారీ ప్యాన్ ఇండియా మూవీలో సంజయ్ దత్ ప్రతినాయకుడిగా నటిస్తున్నారు. తెలుగు, తమిళ, మలయాళ, కన్నడ, హిందీ భాషల్లో ఈ చిత్రాన్ని విడుదల చేయబోతున్నారు. తెలుగులో వారాహి చలన చిత్రం వారు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నారు. ఇక ఈ చిత్రంలో యశ్‌ సరసన శ్రీనిధి శెట్టి హీరోయిన్‌గా నటిస్తుండగా..రవీనా టండన్‌ మరో కీలకపాత్ర పోషిస్తోంది. ర‌వి బ‌స్రూర్ సంగీతం సమకూర్చుతున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3azGRPi

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....