Sunday, 23 August 2020

Chiranjeevi: చిరంజీవికి తొలిసారి మోహన్ బాబు సర్‌ప్రైజ్ గిఫ్ట్.. మెగా రియాక్షన్! ఎంతైనా దోస్తులు దోస్తులే..

మెగాస్టార్ , డైలాగ్ కింగ్ .. టాలీవుడ్ టామ్ అండ్ జెర్రీగా ఈ జోడీ యమ ఫేమస్. అయితే ఈ స్టార్స్.. ఈ ఏడాది ఆరంభంలోనే 'మా' 2020 డైరీ ఆవిష్కరణ కార్యక్రమంలో ఆత్మీయ ఆలింగనం చేసుకోవడం హాట్ టాపిక్ అయిన సంగతి తెలిసిందే. దీంతో ఈ లెజెండ్స్ ఫోటో సోషల్ మీడియాను షేక్ చేసేసింది. ఈ క్రమంలో తాజాగా ఓ ప్రత్యేక సందర్భం కారణంగా మరోసారి వార్తల్లో సెంటర్ పాయింట్ అయ్యారు చిరంజీవి, మోహన్ బాబు. మొదటిసారి మెగాస్టార్‌కి పుట్టిన రోజు కానుక ఇచ్చి సర్‌ప్రైజ్ చేశారు మోహన్ బాబు. శనివారం (ఆగస్టు 22) చిరంజీవి తన 65వ పుట్టినరోజును ఘనంగా జరుకున్నారు. ఈ సందర్భంగా మెగా అభిమాన లోకంతో పాటు పలువురు సినీ ప్రముఖులు ఆయనకు ప్రత్యేకంగా పుట్టిన రోజు శుభాకాంక్షలు చెబుతూ సోషల్ మీడియాను హోరెత్తించారు. అయితే తాజాగా చిరంజీవి చిర‌కాల మిత్రుడు మోహన్ బాబు మాత్రం కాస్త స్పెషల్ అనిపించుకుంటూ అబ్బురపరిచే కానుక ఇచ్చారు. కొయ్య‌తో చేసిన‌ బుల్లెట్‌ను చిరంజీవి బర్త్ డే స్పెషల్ గిఫ్ట్‌గా ఇచ్చారు మోహన్ బాబు. ఈ విషయాన్ని తెలుపుతూ మోహన్ బాబు ఇచ్చిన పుట్టినరోజు కానుకను అందరి ముందుంచారు మెగాస్టార్. ఈ మేరకు ''నా చిరకాల మిత్రుడు, తొలిసారిగా నా పుట్టిన రోజు నాడు, ఓ కళాకృతిని కానుకగా పంపాడు. ఆ కానుకలో అతని రాజసం, వ్యక్తిత్వం ఉట్టిపడుతున్నాయి. థాంక్యూ మోహన్ బాబు'' అని పేర్కొన్నారు చిరంజీవి. ఇక ఈ పోస్ట్ చూసి.. ''ఆయన స్వభావం ఏదైనా.. జీవితంలో మొదటిసారి గిఫ్ట్ పంపించండం అనేది సంతోషదాయకం. అభినందనీయం, దోస్తులు దోస్తులే మచ్చ లేని దోస్తులే'' అంటూ కామెంట్స్ చేస్తున్నారు నెటిజన్లు. Also Read: ఇకపోతే చిరంజీవి బర్త్ డే స్పెషల్‌గా ఆయన తాజా సినిమా 'ఆచార్య' నుంచి మోషన్ పోస్టర్ రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ మోషన్ పోస్టర్ సామాజిక మాధ్యమాల్లో ట్రెండ్ అవుతోంది. కొరటాల శివ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ ఆచార్య మూవీలో చిరంజీవి సరసన కాజల్ నటిస్తోంది. రామ్ చరణ్ కీలకపాత్ర పోషిస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3j4tOIK

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....