Sunday, 23 August 2020

దర్శకుడిగా మారిన కిరాక్ ఆర్పీ: హీరోగా జేడీ.. నాగబాబు ఆశీర్వాదం

‘జబర్దస్త్’ కామెడీ షో ద్వారా తెలుగు ప్రేక్షకులకు సుపరిచితమైన కమెడియన్, స్క్రిప్ట్ రైటర్ దర్శకుడిగా మారారు. శ్రీ ప‌ద్మజ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై కోవూరు అరుణాచ‌లం నిర్మాత‌గా కిరాక్ ఆర్పీ ద‌ర్శక‌త్వంలో తెర‌కెక్కుతున్న సినిమా పూజా కార్యక్రమాల‌తో ఆదివారం ప్రారంభ‌మైంది. ఈ సినిమాలో ప్రధాన పాత్రను జేడీ చ‌క్రవ‌ర్తి పోషిస్తున్నారు. ప‌ద్మజ పిక్చర్స్ ఆఫీసులో జ‌రిగిన పూజా కార్యక్రమానికి మెగా బ్రదర్ నాగబాబు అతిథిగా విచ్చేశారు. చిత్ర బృందానికి శుభాకాంక్షలు తెలిపారు. నాగబాబుతో పాటు పలువురు జబర్దస్త్ కమెడియన్లు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా ద‌ర్శకుడు కిరాక్ ఆర్పీ మాట్లాడుతూ.. ‘‘గ‌త కొన్నేళ్లుగా జబర్దస్త్ కామెడీ షో ద్వారా న‌న్ను ఆద‌రించిన తెలుగు ప్రేక్షకుల‌కి కృత‌జ్ఞత‌లు. సస్పెన్స్ థ్రిల్లర్ నేప‌థ్యంగా ఓ ఇంట్రెస్టింగ్ స్టోరీ కుద‌ర‌డంతో ద‌ర్శకునిగా ప్రేక్షకుల ముందుకు రావాలని నిర్ణయించుకున్నాను. నా మీద న‌మ్మకంతో నిర్మాత కోవూరు అరుణాచలం గారు సినిమాని నిర్మించ‌డానికి ముందుకొచ్చారు. ప‌ద్మజ పిక్చర్స్ బ్యాన‌ర్‌పై తొలి చిత్రమిది. నా దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో జేడీ చ‌క్రవ‌ర్తి కీల‌క పాత్ర పోషించ‌‌డానికి అంగీక‌రించ‌డం చాలా ఆనందంగా ఉంది’’ అని చెప్పారు. Also Read: ఈ సినిమాలో జేడీ పాత్ర చాలా విల‌క్షణంగా ఉంటుందన్నారు ఆర్పీ. ఆయనతో పాటు, ప్రకాష్ రాజ్, రావు ర‌మేశ్, జబర్దస్త్ ఆదిత్య త‌దిత‌రులు ఈ సినిమాలో న‌టిస్తున్నారని చెప్పారు. సాధ్యమైనంత త్వర‌లో హైద‌రాబాద్, నెల్లూర్ ప‌రిస‌ర ప్రాంతాల్లో షూటింగ్ ప్రారంభించ‌డానికి స‌న్నాహాలు చేస్తున్నామని వెల్లడించారు. ఈ చిత్రానికి చరణ్ అర్జున్ సంగీతం సమకూరుస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gkEQYz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....