కరోనా వైరస్ గురించి పెద్దగా భయపడాల్సిన పనిలేదు.. ఇది చిన్న జ్వరం లాంటిదే.. దీనికి నీ..నా అనే భేదం లేదు.. అందరికీ రావొచ్చు.. కరోనాతో సహవాసం చేయాల్సిందే అంటే ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న ఏపీ ముఖ్యమంత్రి జగన్ ఈ వ్యాఖ్యలు చేయడంతో ప్రతిపక్షపార్టీలతో పాటు.. జగన్ అంటే గిట్టని చాలామంది హేళన చేశారు.. బ్లీచింగ్ పౌడర్ అంటూ ట్రోల్ చేశారు.. ఇప్పుడేమంది అందరూ కూడా కరోనాతో సహవాసం చేస్తున్నారు అంటూ నటుడు చురకలు వేస్తూ.. జగన్ ప్రభుత్వంపైనా ఆయన పాలనపై ప్రశంసలు కురిపించారు. అంతేకాదు జగన్‌ని ఓడించాలి అంటే మరో కొత్త నాయకుడు రావాలి తప్ప ఇప్పుడున్న చంద్రబాబు ఇతర నాయకుల వల్ల కాని పని అంటూ తేల్చేశారు రాజా రవీంద్ర. ఆయన మాట్లాడుతూ.. ‘మనం ప్రస్తుతం కరోనా గురించి ఆలోచించాలి.. ఇదే పెద్ద విలన్. ఇక రాజకీయాల గురించి చెప్పాలంటే.. ఏపీలో జగన్ తప్ప వేరే లీడర్ లేరు. ఆయన చేసిన మంచి మంచి పనులతో బలమైన నేత అయ్యారు. ఒక ఏడాదిగా ఇంత బలమైన నేతగా మారడంతో వచ్చే నాలుగేళ్లలో మరింత శక్తివంతంగా మారతారు. ఖచ్చితంగా చెబుతున్నా.. ఆయన చేసిన పనులకు ప్రతి ఇంట్లోనూ జగన్ ఫొటో పెట్టుకుంటారు.. దేవుడిగా కొలిచే రోజులు రాబోతున్నాయి. గ్యారంటీగా ఆయన అనుకున్నది చేస్తారు. చేయాలి అనుకుంటే.. మా ఇవ్వడమే కాదు.. డెడికేషన్‌గా వర్క్ చేస్తారు. అయితే జగన్ మరో 30 ఏళ్లు పాటు సీఎంగా ఉంటారా?? లేదా అన్నది చెప్పలేం కాని.. వచ్చే ఎలక్షన్స్‌లో మాత్రం ఖచ్చితంగా గెలుస్తారు. ఇందుకంటే ఇప్పుడున్న లీడర్లు ఆయన్ని ఓడించడం కష్టం .. కొత్త లీడర్ పుట్టుకుని రావాలంటే టైం పడుతుంది. ఉన్న లీడర్ మళ్లీ రావడం అంటే జరగని పని. వాళ్లు చేసిన పనులకు జనంలో చాలా వ్యతిరేకత వచ్చింది. చంద్రబాబు మీడియా వ్యవస్థతో పాటు.. ఇతర వ్యవస్థల్ని బాగా బిల్డప్ చేసుకున్నారు. అంతేకాకుండా రామారావుగారి దగ్గర నుంచి తెలుగుదేశానికి కేడర్ ఉంది. ఇప్పుడు ఈ నాలుగేళ్లలో ఆ బలమైన కేడర్ వైసీపీ వైపుకి వచ్చేస్తుంది. జగన్‌కి ప్రధాన బలం ఏంటి అంటే.. రాజశేఖర్ రెడ్డిగారి అభిమానులంతా జగన్ వైపునే ఉన్నారు. దీంతో పాటు.. ఈయన చేస్తున్నమంచి మంచి సంక్షేమ పథకాల ద్వారా ఓన్ అడెండిటీ సాధించారు. దీనివల్ల టీడీపి క్యాడర్ జగన్ వైపుకి మళ్లింది. ఆల్రెడీ టీడీపీ దెబ్బతిని ఉంది.. ఇప్పట్లో బిల్డ్ అయ్యే ఛాన్స్ లేదు. ఒక కొత్త నాయకుడు వస్తే బిల్డ్ అవ్వొచ్చు. దానికి టైం పడుతుంది. చంద్రబాబు నాయుడు గతంలో ఉన్నంత యాక్టివ్‌గా ఇప్పుడు పనిచేయడం కష్టం. ఆయన వెనుక ఉండి.. పార్టీని కాపాడగలిగే నాయకుడు కనిపించడం లేదు. జగన్ గారు అయితే.. జైలులో పెట్టినా ఏం చేసినా జనం మధ్యలోనే తిరిగి 3650 కిలోమీటర్లు నడిచి.. ప్రజలకు ఏదో చేయాలనే దానిపై నిలబడి సోనియా గాంధీని ఎదిరించి నిలిచారు. ఇతన్ని తప్పకుండా ఆదర్శంగా తీసుకోవాలి. ఆ ఏజ్‌లో సీఎం కావడం.. అదీ కూడా ఎవరితోనూ పొత్తులేకుండా సీఎం అవ్వడం అంటే చిన్న విషయం కాదు. ఇప్పుడే ఏ ఎన్నికల్లోనూ ఆయన పొత్తు పొట్టుకోరు. ఓడిపోయానా తరువాత చూసుకుందాంలే అనుకుంటారు తప్ప.. సోలోగానే విక్టరీ కొడతాడు. ఆయనది ఒన్ మ్యాన్ షో. అలాగే వేరే పార్టీ నాయకుల్ని తన పార్టీలోకి తీసుకోవాలి అంటే రాజీనామా చేసే రమ్మంటున్నారు. ఈ పాలసీ చూస్తే ఫ్యూచర్‌లో గొప్ప లీడర్ అవుతారు. ఖచ్చితంగా అందరూ పొగిడే రోజుల వస్తాయి. జగన్ గారు.. కరోనాతో సహవాసం చేయాలని అంటే.. ప్రతిపక్షం వాళ్లు వెకిలి నవ్వులు నవ్వి వెకిలి వేషాలు వేశారు. ఏమైంది ఇప్పుడు.. నూటికి నూరు శాతం సహవాసం చేస్తున్నారు. దీనికి మందు రాదు.. ఏం రాదు.. అందరికీ వచ్చి తరువాత పోతుంది. ఆయన ప్రతిమనిషికి కావాల్సిన ఆరోగ్యం, విద్యపై బాగా ఫోకస్ పెట్టారు. చదువుకుంటే వాడు ఎక్కడైనా బతుకుతాడని ఆయన బలంగా నమ్ముతున్నారు. ఏ గవర్నమెంట్ కూడా ఇది ఆలోచించలేదు. మన బ్యాడ్ ఏంటంటే గవర్నమెంట్ స్కూల్స్‌లో తెలుగు మాత్రమే చెప్తారు ఇంగ్లీష్ చెప్పరు. ఆ స్కూల్‌లో చదివిన వాళ్లు బయటకు వెళ్తే ఇంగ్లీష్ రాకుండా ఏం చేయగలుగుతాడనే ఉద్దేశంతో ప్రభుత్వ స్కూల్స్‌లో ఇంగ్లీష్ మీడియం అనే కార్యక్రమాన్ని చేపడితే దానిపై పెద్ద గొడవ. మీడియం మార్చితే నష్టం ఏమిటో అర్థం కావడం లేదు. ఇంగ్లీష్ మీడియం వద్దు అని స్టేట్ మెంట్లు ఇచ్చిన వాళ్లెవ్వరూ కూడా వాళ్ల పిల్లలు, మనవళ్లు ఇంగ్లీష్ మీడియంలోనే చదువుతుంటారు. వాళ్ల పిల్లలు ఇంగ్లీష్ మీడియంలో చదువుకోవాలి.. లేనివాడు ఇంగ్లీష్ మీడియంలో చదువుకుంటాడంటే వీళ్లకి ఇష్టం ఉండదు. అయినా వీళ్ల మాటలను జగన్ పట్టించుకోరు.. చేయాలని అనుకున్నారు తప్ప చేసేస్తారు. నిజంగా జగన్ గారి.. ఇంగ్లీష్ మీడియం ఆలోచన అద్భుతం. ఓ పదిహేనేళ్లు తరువాత దీని రిజల్ట్ ఏంటో మీరే చూస్తారు. అందుకే అంటున్నా ప్రతి ఇంట్లోనూ జగన్ ఫొటో పెట్టుకుంటారని’ అంటూ జగన్ పాలనపై ప్రశంసల జల్లు కురిపించారు రాజా రవీంద్ర.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gYLvsy
No comments:
Post a Comment