Thursday, 13 August 2020

ఇంద్రప్రస్థం మోషన్ పోస్టర్: ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ పొలిటీషియన్స్‌పై స్పెషల్ ఫోకస్.. ఆ కిక్కే వేరులే!

ఆంధ్రప్రదేశ్ ఐకానిక్ పొలిటీషియన్స్‌ నారా చంద్రబాబు నాయుడు, వైఎస్ రాజశేఖర్ రెడ్డిల స్నేహ బంధం, ఆ తర్వాత వారి వారి రాజకీయ ప్రయాణంపై డైరెక్టర్ దేవ కట్టా తన సినిమాను ప్రకటించారు. ఈ సినిమాకు '' టైటిల్ ఫిక్స్ చేస్తూ ప్రీ లుక్ పోస్టర్, మోషన్ పోస్టర్ రిలీజ్ చేశారు. చంద్రబాబు, వైఎస్‌ఆర్ స్నేహంపై తాను ఓ కల్పిత కథాంశాన్ని రెడీ చేస్తున్నట్లు ముందే ప్రకటించిన దేవ కట్టా.. తాజాగా మోషన్ పోస్టర్ రిలీజ్ చేసి సినిమాపై హైప్ తీసుకొచ్చారు. చంద్రబాబు, వైఎస్ షాడో ఇమేజీలను చూపిస్తూ ప్రీ లుక్ పోస్టర్ రిలీజ్ చేసిన ఆయన.. నైతికత మారినా కూడా అధికారం కోసం జరిగే యుద్ధం ఎప్పుడూ స్థిరంగా ఉంటుందని పేర్కొన్నారు. ఇక మోషన్ పోస్టర్‌లో అయితే పదునైన డైలాగులతో అందరినీ ఆకట్టుకున్నారు. ''ప్రపంచంలో జరిగే పోటీలన్నింటికీ పర్పస్ ఒక్కటే. విజేతలను ఎంచుకోవడం.. ఆ విజేతలే ప్రపంచాన్ని నడిపిస్తారు. అయితే ఆ పోటీలో అనుకోకుండా ఇద్దరు స్నేహితులు ఎదురైతే ఆ ఆటకున్న కిక్కేవేరు'' అంటూ తన సినిమా ఎలా ఎలా ఉండబోతుందో ఒక్కమాటలో చెప్పేశారు దేవ కట్టా. Also Read: వైఎస్‌ఆర్, సీబీఎన్ రాజకీయ జీవితంపై 2017లోనే తాను స్క్రిప్ట్ రాశానని, ఈ కల్పిత కథను కాపీ రైట్స్ యాక్ట్ కింద రిజిస్టర్ కూడా చేయించానని తెలిపిన దేవ కట్టా తాజా మోషన్ పోస్టర్ ద్వారా ఈ సినిమాపై అంచనాలు పెంచేశారు. ప్రొడోస్ ప్రొడ‌క్ష‌న్స్ ప‌తాకంపై రూపొందుతున్న ఈ సినిమాకు తేజ సి, హ‌ర్ష విలు నిర్మాత‌లుగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. అతిత్వరలో ఈ మూవీకి సంబంధించిన ఇతర వివరాలు ప్రకటించనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DS6O0v

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....