Wednesday, 12 August 2020

నీ బతుకెంత? నీ కారెంత? అన్నావ్, దేవుడన్నాడ్రా దగ్గుబాటి అభిరామ్!: శ్రీరెడ్డి షాకింగ్ వీడియో

మాజీ ప్రియుడిపై రాజీలేని సంచలన ఆరోపణలు చేస్తూ వివాదస్పద నటిగా పేరొందిన .. పొద్దుపొద్దునే ఓ వీడియో వదిలింది. తన మాజీ ప్రియుడు, దగ్గుబాటి వారసుడు కారు ప్రమాదానికి గురికావడంతో.. అయ్యో!! ఎంతైనా మాజీ ప్రియుడు.. ఎలా ఉన్నాడో ఏంటో అని కంగారు పడి వీడియో పెట్టింది అనుకుంటే పొరపాటే.. దేవుడు ఉన్నాడ్రా అభిరామ్ అంటూ తన గతాన్ని గుర్తుచేసుకుంది శ్రీరెడ్డి. శ్రీరెడ్డి షేర్ చేసిన వీడియోలో తనదైన శైలిలో బూతులతో విరుచుకుపడలేదు కాని.. అభి గతంలో తనను అన్న మాటల్ని గుర్తుచేసింది. ‘అభి (దగ్గుబాటి అభిరామ్) నీకు గుర్తుందా.. నీ కారు ఎంత? నీ స్థాయి ఎంత? నేను రానా తమ్ముడ్ని.. సురేష్ బాబు కొడుకుని.. రామానాయుడు మనువడ్ని.. నీదో డొక్కు కారు.. నువ్వు ఆఫ్ట్రాల్ రోడ్ సైడ్ యాక్టర్స్‌వి.. అని అన్నావే.. నన్నూ, నా కార్‌ని అవమానించావే.. ఈరోజు నీ కారుకి ఏదో యాక్సిడెంట్ అయినట్టు ఉంది. దేవుడు ఉన్నాడ్రా.. దేవుడు ఉన్నాడు.. ఎప్పుడూ మిడిసిపడకు. డబ్బు, పేరు, అందం శాశ్వతం కాదురా.. మంచి పేరు, మంచితనమే శాశ్వతంగా ఉంటాయి. ఎదుటి వాళ్లని అర్థం చేసుకోవడం.. వాళ్లకి అపకారం చేయకుండా ఉండటం.. మంచిగా బతకడం. నేనైతే ఉత్తమురాలిని కాకపోవచ్చు కాని.. నేను నీకు చెప్పినవాటిని ఫాలో అవుతున్నాను.. నేర్చుకుంటున్నాను’ అంటూ ఎమోషనల్ అవుతూ తన ఫేస్ బుక్ ద్వారా వీడియో విడుదల చేసింది శ్రీరెడ్డి. ఇక అభిరామ్ కారు ప్రమాదం విషయానికి వస్తే.. హైదరాబాద్ మణికొండలో దగ్గుబాటి అభిరామ్ నడుపుతున్న బీఎండబ్ల్యూ కారుని ఎదురుగా వచ్చిన బ్రీజా కారు ఢీకొట్టింది. ఈ ఘటనలో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. రాయదుర్గం పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... కరీంనగర్‌ జిల్లా ఆరేపల్లి గ్రామానికి చెందిన రాజు అనే వ్యక్తి మెకానిక్‌ లక్ష్మణ్‌ ద్వారా బ్రీజా కారు కొనేందుకు నగరానికి వచ్చాడు.. యజమాని నుంచి టెస్ట్‌ డ్రైవ్‌ కోసం కారు తీసుకొని స్నేహితుడు సతీష్‌ కలిసి డ్రైవ్‌కు వెళ్లాడు. మల్లెమాల ప్రొడక్షన్‌ హౌస్‌ వద్దకు వచ్చేసరికి.. పక్కగా వస్తున్న అభిరామ్ కారుని గమనించకపోవడంతో బలంగా ఢీ కొట్టాడు. అయితే కార్లలో ఉన్నవాళ్లకి గాయాలు కాలేదు కాని.. కార్లు మాత్రం దెబ్బతిన్నాయి. దీంతో రాజుతో పాటు దగ్గుబాటి అభిరామ్‌లు బుధవారం సాయంత్రం రాయదుర్గం పీఎస్‌లో ఫిర్యాదు చేయడంతో విషయం బయటకు వచ్చింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3gTzAfE

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....