Saturday, 22 August 2020

దర్శకుడిని పెళ్లాడిన ‘కృష్ణ అండ్ హిజ్ లీల’ హీరోయిన్.. ఫీలవుతున్న ఫ్యాన్స్

‘కృష్ణ అండ్ హిజ్ లీల’ సినిమా ద్వారా తెలుగు ప్రేక్షకులకు దగ్గరైన యంగ్ హీరోయిన్ షాలిని వడ్నికట్టి పెళ్లి చేసుకున్నారు. తమిళ దర్శకుడు మనోజ్ బీధను ఆమె పెళ్లాడారు. వీరిద్దరూ చాలా కాలంగా ప్రేమలో ఉన్నారు. మనోజ్ బీధకు తమిళనాడులో మంచి పాపులారిటీ ఉంది. 2018లో వచ్చిన థ్రిల్లర్ మూవీ ‘వంజగర్ ఉళగం’తో మనోజ్ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. కాగా, షాలిని-మనోజ్ వివాహ వేడుక ఈనెల 21న చెన్నైలో జరిగింది. ఈ వివాహ వేడుకలో కొంత మంది స్నేహితులు, కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొన్నారు. తన పెళ్లి ఫొటోలను షాలిని ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అభిమానులతో పంచుకున్నారు. షాలిని-మనోజ్ జంట చూడముచ్చటగా ఉంది. అయితే, షాలినికి పెళ్లి అయిపోవడంపై ఆమె ఫ్యాన్స్, ఫాలోవర్లు ఫీలవుతున్నారు. ఇంత త్వరగా పెళ్లిచేసుకున్నారేంటి అని బాధపడుతున్నారు. ఈ మేరకు షాలిని ఇన్‌స్టాగ్రామ్ పోస్టులో కామెంట్లు పెడుతున్నారు. అయినప్పటికీ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ అంటూ శుభాకాంక్షలు చెబుతున్నారు. ఇదిలా ఉంటే, 2015లో వచ్చిన కన్నడ మూవీ ‘ప్లస్’ ద్వారా షాలిని వడ్నికట్టి హీరోయిన్‌గా పరిచయమయ్యారు. అదే ఏడాది, ‘వెళ్లాయియా ఇరుకిరవన్ పోలి సొల్ల మాటన్’ అనే తమిళ చిత్రంలో నటించారు. 2019లో ఆమెకు టాలీవుడ్ ఛాన్స్ వచ్చింది. కార్తీక్ ఆనంద్ దర్శకత్వంలో వచ్చిన ‘యురేక’ సినిమా ద్వారా తెలుగు ఇండస్ట్రీకి షాలిని పరిచయమయ్యారు. షాలిని టీవీ షోలతో కూడా పాపులర్ అయ్యారు. ‘నేను మీ కళ్యాణ్’, ‘సో యు థింక్ యు కెన్ డాన్స్’ అనే షోలలో షాలిని పాల్గొన్నారు. Also Read:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3l9D3JA

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....