సినిమా ఇండస్ట్రీపై కరోనా వైరస్, లాక్‌డౌన్ ఎంత ప్రభావం చూపించాయో అందరికీ తెలిసిందే. షూటింగ్‌లు ఆగిపోయి, థియేటర్లు మూతబడి తీవ్ర నష్టం జరిగింది. షూటింగ్‌లు ఆగిపోవడంతో రోజువారీ వేతనానికి పనిచేసే ఎంతో సినీ కార్మికులు ఉపాధి కోల్పోయారు. ఇలాంటి పరిస్థితిలో సినిమా ఇండస్ట్రీని ఆదుకోవడానికి మెగాస్టార్ చిరంజీవి సారథ్యంలో సినీ పెద్దలు రెండు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో చర్చలు జరిపారు. ముఖ్యంగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్‌తో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటుచేసుకుని పరిస్థితిని చక్కదిద్దేందుకు ప్రయత్నించారు. అయితే, ఈ సమావేశాలకు నందమూరి బాలకృష్ణను ఆహ్వానించకపోవడం వివాదానికి దారి తీసింది. తనను పిలవకపోవడంపై బాలకృష్ణ బహిరంగంగానే ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘నన్ను ఎవరూ పిలవలేదు. మీటింగ్‌లు పెట్టుకుని ఏం చేస్తున్నారు.. భూములు పంచుకుంటున్నారా?’’ అని బాలయ్య నోరుజారారు. దీంతో ఈ విషయం రచ్చ రచ్చ అయ్యింది. మీడియాలో కథనాలు, రెండు వర్గాలుగా విడిపోయిన సినిమా ఇండస్ట్రీ నుంచి విమర్శలు, ప్రతి విమర్శలు మొదలయ్యాయి. Also Read: ఇదిలా ఉంటే, సినిమా పెద్దలు నిర్వహించిన సమావేశాల్లో పాల్గొనని మరో ప్రముఖ నటుడు మోహన్ బాబు. మరి ఆయన ఎందుకు హాజరుకాలేదు అంటే.. తనను ఎవరూ పిలవలేదు అని ఆయన సమాధానం ఇచ్చారు. అయితే, ఈ వివాదంపై తాను ఏమీ మాట్లాడనని, తనను ఏమీ అడగవద్దని స్పష్టం చేశారాయన. తాజాగా న్యూస్ ఛానెల్ ఎన్టీవీకి ఇచ్చిన ఇంటర్వ్యూలో ప్రభుత్వాలతో సినిమా పెద్దల చర్చల గురించి ప్రస్తావన వచ్చింది. కానీ, దీనిపై మాట్లాడటానికి ఆసక్తి చూపలేదు. ‘‘కొన్ని విషయాలు నేను మాట్లాడను. నన్ను అడగద్దండి. బాలకృష్ణను నేను బాలయ్య అంటాను, సోదర అంటాను, మా అన్నగారి కుమారుడు, ఆయనకు నేను గౌరవం ఇస్తాను, నా కన్నా చిన్నవాడు, ఐ లవ్ హిమ్, ఐ లైక్ హిమ్, మేం ఎప్పుడైనా మాట్లాడుకుంటూ ఉంటాం. ఎవరి వ్యక్తి విషయాలు వాళ్లవి. వాళ్ల మాటలపై నేను మాట్లాడటం కరెక్ట్ కాదు. వాళ్ల అభిప్రాయాలు తప్పు అని నేను చెప్పను. ఆయన అభిప్రాయం అది. నా గురించి ఎవరైనా ఏదైనా మాట్లాడితే నేను స్పందిస్తాను’’ అని అన్నారు. సినీ పెద్దలు జరిపిన చర్చలకు తనను కూడా పిలవలేదని మోహన్ బాబు స్పష్టం చేశారు.
from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hp5alD
No comments:
Post a Comment