Wednesday, 12 August 2020

పూర్తిగా ముసలాడిలా మారిపోయిన నాగార్జున.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న షాకింగ్ లుక్

టాలీవుడ్ మన్మథుడు ఎవరంటే అందరికీ తెలిసిందే. 60 ఏళ్ల వయస్సులో కూడా మరింత గ్లామర్‌గా కనిపించి... అభిమానుల మనసు కట్టిపడేస్తున్న హీరో . ఆయన వయసు పెరుగుతుందా తగ్గుతుందా ? అనే అనుమానం అందరికీ వస్తోంది. అంతలా తన ఫిట్‌నెస్‌పై శ్రద్ధ పెట్టే నాగార్జున తాజాగా ఓల్డ్ గెటప్‌లో కనిపిస్తూ అందర్నీ ఆశ్చర్యపరుస్తున్నారు. తెలుగు బిగ్ బాస్ సీజన్‌లో ఆయన ఇప్పటికే హోస్ట్‌గా చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరోసారి బిగ్ బాస్ సీజన్ 4 కోసం తాజాగా స్టార్ మా ఓ ప్రోమో విడుదల చేసింది. అందులో నాగ్ లుక్ చూసి ఆయన అభిమానులతో పాటు తెలుగు ప్రేక్షకులంతా షాక్ అవుతున్నారు ఈ నెలాఖరు నుండి బుల్లితెర ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందించనున్నబిగ్ బాస్ సీజన్ 4 కార్యక్రమం మొదలవుతున్న విషయం తెలిసిందే. దీనికి సంబంధించి ఒక్కొక్కటిగా ప్రోమోలు విడుదల చేస్తోంది స్టార్ మా. తాజాగా నాగార్జున లుక్‌కి సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో ఆయన వైట్ హెయిర్, మీసాలు గడ్డాలతో మొత్తం ముసలివాడిలా కనిపించి అందరికి షాక్ ఇచ్చారు. అంతేకాదు ప్రోమోలో ‘గోపి’ అంటూ నాగ్ ఓ చిన్న నవ్వు కూడా నవ్వారు. ‘నెక్ట్స్ ఏం జరుగుతుందో చూడటానికి స్టే ట్యూనడ్’ అంటూ క్యాప్షన్‌తో ఈ వీడియోను సోషల్ మీడియాలో షేర్ చేసింది స్టార్ మా సంస్థ. దీంతో బిగ్ బాస్ ప్రేక్షకులలో అనేక అనుమానాలు మొదలయ్యాయి. Read More: సీజన్‌ 3లో నాగార్జున పండు అంటూ ఒక కోతి బొమ్మను వేలుకు పెట్టుకొని దానితో అనేక విషయాలు షేర్ చేస్తూ ఉండేవారు. ఈ సారి గోపి అంటూ మరెవరిని పట్టుకొస్తారా అని అందరిలో ఆసక్తి నెలకొంది. ఇదిలా ఉంటే సీజన్‌3లో టిప్ టాప్‌గా రెడీ అయి వచ్చిన నాగార్జున ఈ సారి ముసలి గెటప్‌లో దర్శనమిచ్చాడేంట్రా అని నెటిజన్స్ చెవులు కొరుక్కుంటున్నారు. ఈ విషయాలకి పూర్తి క్లారిటీ రావాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చేసి చూడాల్సిందే.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/31R96oC

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....