Sunday, 9 August 2020

చిరంజీవి బర్త్ డే ప్లాన్స్.. ఏకంగా అంతమంది సెలబ్రిటీలు.. ఇదీ మెగాస్టార్ రేంజ్!!

రోజు రోజుకూ సోషల్ మీడియా హవా పెరిగిపోతోంది. చిన్నా,పెద్దా అనే తారతమ్యం లేకుండా ప్రతి వ్యక్తి సోషల్ మీడియా ఖాతాలను ఉపయోగిస్తూ యాక్టివ్‌గా ఉంటున్నాడు. రోజులు ముందుకెళ్తున్నా కొద్దీ నేటితరం నటీనటులతో పాటు సీనియర్ నటులు సైతం సామాజిక మాధ్యమాల్లో చురుకుగా ఉంటున్నారు. ఇక ఇటీవలే ట్విట్టర్ వాల్‌పై వాలిపోయిన మెగాస్టార్ అయితే ఇక్కడ కూడా సత్తా చాటుతూ రాణిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ ఏడాది ఆయన పుట్టిన రోజు సందర్భంగా ఓ భారీ ప్లాన్ వేశారు మెగా ఫ్యాన్స్. సాధారణంగానే తమ అభిమాన హీరో పుట్టినరోజును పండగలా జరుపుకునే ఫ్యాన్స్ సోషల్ మీడియా పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చాక యమ హుషారుగా నెల ముందునుంచే హోరెత్తించే కార్యక్రమాలు చేస్తున్నారు. బర్త్‌డే కామన్ డిస్ల్పే పిక్ (సీడీపీ) మొదలుకొని అడ్వాన్స్ ట్రెండ్, బర్త్‌డే ట్రెండ్ క్రియేట్ చేస్తూ తమ తమ ఫేవరేట్ హీరో సత్తా ఇది చూపిస్తున్నారు. అయితే ఈ ఏడాది ఆగస్టు 22న చిరంజీవి 65వ పుట్టినరోజు సందర్భంగా చాలా గ్రాండ్‌గా కామన్ మోషన్ పోస్టర్ రిలీజ్ చేయనున్నట్లు ఓ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. Also Read: అన్ని సినీ పరిశ్రమల నుండి 65 మంది ప్రముఖులు కలిసి చిరంజీవి కామన్ మోషన్ పోస్టర్‌ను ఆవిష్కరించనున్నట్లు ఈ వీడియో ద్వారా తెలిపారు. ఇలా జరగడం ఇండియన్ సినీ హిస్టరీలోనే ఇదే ఫస్ట్ టైం అని పేర్కొన్నారు. అలా ఆగస్ట్ నెల మొత్తాన్ని చిరు బర్త్ డే ఫెస్ట్‌గా మార్చాలని మెగా ఫ్యాన్స్ డిసైడ్ అయినట్లు టాక్. మరోవైపు చిరంజీవి లేటెస్ట్ మూవీస్ తాలూకు దర్శకనిర్మాతలు చిరంజీవి బర్త్ డే కానుకలు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. ఇకపోతే నిన్న (ఆగస్టు 9) మహేష్ బాబు ఫ్యాన్స్ 60.2 మిలియన్ల ట్వీట్లతో వరల్డ్ రికార్డ్ క్రియేట్ చేయడంతో మెగా ఫ్యాన్స్ మరింత కాకమీదున్నారు. ఆగస్టు 22 చిరంజీవి బర్త్ డే, సెప్టెంబర్ 2 పవన్ కళ్యాణ్ బర్త్ డే సందర్భంగా ఈ రికార్డులను బద్దలుకొట్టి తమ స్టామినా ఏంటో నిరూపిస్తామని సవాల్ విసురుతున్నారు. సో.. చూడాలి మెగా బ్రదర్స్ బర్త్ డే వేడుకలకు సామజిక మాధ్యమాలు ఏ రేంజ్‌లో హోరెత్తిపోతాయో!.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3inDmOG

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....