Monday, 24 May 2021

నందమూరి అభిమానులకు శుభవార్త చెప్పిన ఎన్టీఆర్.. వాళ్ళ సాయం గొప్పదంటూ పోస్ట్

నందమూరి ఫ్యాన్స్ హుషారెత్తిపోయే పోస్ట్ పెట్టారు యంగ్ టైగర్ . తనకు నెగెటివ్ వచ్చిందని తెలుపుతూ ట్విట్టర్ వేదికగా అభిమానులకు శుభవార్త చెప్పారు. ఈ మేరకు తనకు ట్రీట్‌మెంట్ ఇచ్చిన డాక్టర్ల బృందానికి ప్రత్యేకంగా కృతజ్ఞతలు చెప్పారు. గత 15 రోజుల క్రింద తనకు కరోనా సోకిందని స్వయంగా ప్రకటించిన ఎన్టీఆర్.. ఎవ్వరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. అప్పటినుంచి హోమ్ క్వారంటైన్‌లో ఉంటూ మెరుగైన చికిత్స తీసుకున్న ఆయన మద్యమద్యలో తన హెల్త్ అప్‌డేట్స్ కూడా ఇచ్చారు. ఈ నేపథ్యంలో తాజాగా టెస్ట్ చేయించుకుంటే తనకు కరోనా నెగెటివ్ అని వచ్చిందని తెలిపారు ఎన్టీఆర్. ''కరోనా నెగ‌టివ్ వ‌చ్చింద‌ని చెప్ప‌డానికి సంతోషంగా ఉంది. నా ఆరోగ్యం కోసం ప్రార్థించిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌. కిమ్స్ హాస్పిట‌ల్‌కు చెందిన‌ డాక్ట‌ర్ ప్ర‌వీణ్ కుల‌క‌ర్ణి, మా క‌జిన్ డాక్ట‌ర్ వీరు, టెనెట్ డ‌యాగ్నిస్టిక్స్‌ల‌కు ఈ సంద‌ర్భంగా ధ‌న్య‌వాదాలు తెలియ‌జేసుకుంటున్నాను. ట్రీట్మెంట్ ఇవ్వడంలో వాళ్ళ సాయం గొప్పది. కొవిడ్- 19ను సీరియ‌స్‌గా ప‌రిగ‌ణించాలి. అయితే మంచి జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ పాజిటివ్ మైండ్‌తో ఉంటే వైరస్‌ నుంచి సుల‌భంగా బయటపడొచ్చు. మీలోని శ‌క్తే మీకు పెద్ద ఆయుధం. ధైర్యంగా ఉండండి.. భ‌య‌ప‌డ‌కండి'' అని పేర్కొంటూ ఎన్టీఆర్ ట్వీట్స్ చేశారు. ఈ విషయం తెలిసి ఎన్టీఆర్ ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు. ప్రస్తుతం రాజమౌళి దర్శకత్వంలో మెగా వారసుడు రామ్ చరణ్‌తో కలిసి RRR సినిమాలో నటిస్తున్నారు ఎన్టీఆర్. ఈ భారీ మూవీలో కొమురం భీంగా ఎన్టీఆర్, అల్లూరి సీతారామ రాజుగా రామ్ చరణ్ కనిపించబోతున్నారు. ఈ సినిమా షూటింగ్ ఫినిష్ కాగానే కొరటాల శివ, ప్రశాంత్ నీల్ లాంటి టాలెంటెడ్ డైరెక్టర్లను లైన్‌లో పెట్టారు ఎన్టీఆర్.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3hNwddz

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....