Saturday, 1 May 2021

ఆదిలోనే షాక్.. మహేష్-త్రివిక్రమ్ ప్రాజెక్ట్‌ అప్డేట్‌పై ఫ్యాన్స్ ఫైర్

సూపర్ స్టార్ , మాటల మాంత్రికుడు కాంబినేషన్ అంటే టాలీవుడ్ ప్రేక్షకులకు ఎప్పుడూ ప్రత్యేకమే. అతడు సినిమాతో ఈ ఇద్దరి కాంబినేషన్ మీద అందరికీ అంచనాలు పెరిగాయి. అతడు సినిమా వెండితెర మీద లాభాలు కురిపించకపోయినా కూడా అదో చరిత్ర. అతడు సినిమాకు ఉన్న ఫాలోయింగ్ వేరు. బుల్లితెర మీద ఇప్పటికే ఎన్నో వందల వేల సార్లు ప్రసారం చేసినా కూడా అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది. ఇంకా వస్తూనే ఉంటుంది. అలా మహేష్ బాబు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో సినిమా అంటే ఓ రేంజ్‌లో అంచనాలుంటాయి. ఆ అంచనాలు అందుకోలేక ఖలేజా కూడా మొదట డిజాస్టర్ అనే టాక్ సొంతం చేసుకుంది. కానీ ఆ తరువాత బుల్లితెరపై తన ఖలేజా చూపించింది. ఖలేజా సినిమాలోని మహేష్ నటనకు, యాస, భాషకు అందరూ ఫిదా అయ్యారు. అయితే మళ్లీ ఈ కాంబినేషన్‌లో సినిమా ఎప్పుడు వస్తుందా? అని సగటు సినీ ప్రేమికుడు ఎదురుచూస్తున్నారు. మొత్తానికి ఆ సమయం రానే వచ్చింది. ఎన్నో అనూహ్య పరిణామాల తరువాత ఈ కాంబినేషన్ సెట్ అయింది. ఎన్టీఆర్ త్రివిక్రమ్ చేయాల్సిన ప్రాజెక్ట్ క్యాన్సిల్ అవ్వడం.. అదే బ్యానర్‌లో మళ్లీ మహేష్ బాబుతో సినిమా ఓకే అవ్వడం అంతా చకచకా జరిగిపోయింది. ఎన్టీఆర్ కొరటాల శివతో చేయడం, మహేష్ బాబు త్రివిక్రమ్‌కు ఓకే చెప్పడం అంతా అందరికీ షాకింగ్‌లానే అనిపించింది. అయితే నేటి సాయంత్రం నాలుగు గంటల ఐదు నిమిషాలకు మహేష్ త్రివిక్రమ్ ప్రాజెక్ట్ అప్డేట్ రాబోతోందని ప్రకటించారు. కానీ తీరా ఆ సమయం వచ్చే సరికి ప్లేట్ ఫిరాయించారు. అప్డేట్ ఆలస్యం అవుతుంది.. మీ ఎదురుచూపులకు తగ్గట్టే అది ఉంటుంది.. అయినా ఆ అప్డేట్ గురించి మీకు తెలుసు అంటూ నిర్మాతలు ట్వీట్ చేశారు. ఇలా ఆలస్యం అవుతుండటంపై మహేష్ బాబు ఫ్యాన్స్ హర్ట్ అయ్యారు. మేకర్స్‌ను దారుణంగా ఏకిపారేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/332Jw19

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....