Wednesday, 5 May 2021

కరోనా కాటు మరొకరు బలి.. ప్రముఖ హాస్య నటుడు కన్నుమూత.. విషాదంలో ఇండస్ట్రీ

రెండో దశలో కరోనా భయంకరంగా వ్యాపిస్తోంది. ప్రతీ రోజు లక్షల సంఖ్యలో కేసులు నమోదు అవుతున్నాయి. వేలాది మంది ప్రాణాలు కోల్పోతున్నారు. తెలుగు, తమిళ, కన్నడ, బాలీవుడ్‌ ఇండస్ట్రీలకు చెందిన సినీ తారలు వైరస్ బారిన పడ్డారు. వారిలో కొందరు కోలుకోగా.. మరికొందరు ఈ భయంకర వైరస్‌కి బలి అయ్యారు. ముఖ్యంగా వైరస్ ప్రభావం తమిళ, కన్నడ ఇండస్ట్రీలపై తీవ్రంగా ఉంది. ఇప్పటికే ఈ ఇండస్ట్రీలకు చెందిన నిర్మాతలు, దర్శకులు, నటులు పలువురు వైరస్ కారణంగా మృతి చెందారు. తాజాగా ప్రముఖ కోలీవుడ్ హాస్య నటుడు పాండు(74) కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోయారు. 1970లో ‘మానవన్’ అనే సినిమాతో నటుడిగా ఆరంగేట్రం చేశారు. ఆయన తర్వాత పలు సినిమాల్లో నటించిన ఆయనకు ‘కర్రైల్లెం షేన్‌బాగవూ’ సినిమాతో మంచి గుర్తింపు లభించింది. కాదల్ కొట్టై, పనక్కరన్, దైవ నాకు, రాజది రాజ, నాట్టమై, ఉల్లతై అల్లితా, వాలి, ఎన్నవాలే అండ్ సిటిజన్, తదితర సినిమాల్లో ఆయన నటించారు. రాజకీయాల్లో కూడా ఆయన తన సత్తా చాటుకున్నారు. ఎంజీఆర్ నేతృత్వంలోని అన్నాడీఎంకే పార్టీ లోగోని డిజైన్ చేసిన ఘనత పాండూకి దక్కింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఉన్న పాండు.. చెన్నైలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేరారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో.. గురువారం ఆయన తుదిశ్వాస విడిచారు. పాండుకి భార్య కుముధ, ముగ్గురు కుమారులు ఉన్నారు. పాండు భార్య కుముధకి కూడా కరోనా సోకింది. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. పాండు మృతితో తమిళ సినీ పరిశ్రమ శోకసంద్రంలో మునిగిపోయింది. ప్రముఖ నిర్మాత ధనంజయన్, హాస్య నటుడు మనోబాల తదితరులు పాండు మృతికి సంతాపం తెలిపారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3eovUE0

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....