Sunday, 23 August 2020

Sai Dharam Tej: సాయి తేజ్ ప్రేమలో పడ్డాడండోయ్.. సీక్రెట్ రివీల్ చేశాడిలా.. అందుకే ప్రభాస్‌కి సారీ

ముందుగా చేపినట్లుగానే మెగామేనల్లుడు అసలు విషయం బయటపెట్టేశాడు. ఈ టాలీవుడ్ మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచిలర్ ప్రేమలో పడిపోయాడట. నిన్న (ఆదివారం) ప్రభాస్‌కు సారీ చెబుతూ ఇప్పుడు తన వంతు వచ్చిందని ఆసక్తి రేకెత్తించిన సాయి ధరమ్ తేజ్.. తాజాగా ఈ విషయాన్ని అఫీషియల్ చేస్తూ ప్రకటన ఇచ్చేశాడు. సరిగ్గా చెప్పిన సమయానికే ఆయన పేల్చిన బాంబ్ మెగా అభిమానుల్లో సరికొత్త ఉత్సాహాన్ని నింపింది. మరి సాయి తేజ్ చెప్పిన ఆ సీక్రెట్ ఏంటో చూద్దామా.. అదేనండీ.. మనమంతా ఊహించినట్లుగానే తన లేటెస్ట్ మూవీ '' మూవీ నుంచి అప్‌డేట్ ఇచ్చాడు సాయి ధరమ్ తేజ్. ''అంత స్ట్రిక్ట్‌గా సోలో బ్రతుకు సో బెటర్ అని అందరికీ చెప్పే విరాట్‌కి అమృత‌ని చూసాక ఏమైంది ???'' అని ట్యాగ్ చేస్తూ తన తాజా సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్' నుంచి ''హే.. ఇది నేనేనా'' సాంగ్ విడుదల చేస్తున్నట్లు తెలిపాడు. ఈ పాటను ఆగష్టు 26వ తేదీ ఉదయం 10 గంటలకు రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. దీంతో ప్రభాస్‌కి సారీ చెప్పిన సీక్రెట్ ఏంటో ఇలా బయటపడింది. Also Read: ఓ వ్యక్తి బ్యాచిలర్ లైఫ్ లోనే అసలు కిక్ ఉందని చెప్పే ప్రయత్నం చేస్తూ.. చివరకు అతనే ఎలా ప్రేమలో మునిగాడో తెలిపే సినిమా 'సోలో బ్రతుకే సో బెటర్'. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర ఎల్‌ఎల్‌పీ బ్యానర్‌పై రూపొందుతున్న ఈ సినిమాకు నూతన దర్శకుడు సుబ్బు దర్శకత్వం వహిస్తున్నారు. సాయి ధరమ్ తేజ్ సరసన హీరోయిన్‌గా నటిస్తోంది. బివిఎస్‌యెన్ ప్రసాద్ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. మే 1వ తేదీన విడుదల కావాల్సిన ఈ మూవీ లాక్‌డౌన్ కారణంగా వాయిదా పడింది. థియేటర్స్ రీ ఓపెన్ కాగానే ఈ సినిమాను విడుదల చేయనున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2Qq1e8d

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....