Sunday, 9 August 2020

నువ్వే నా బలం, బలహీనత.. నిన్నే పేమిస్తున్నా! లవ్ యూ అంటూ సురేఖావాణి ఎమోషనల్ కామెంట్స్

సురేఖావాణి.. తెలుగు సినీ పరిశ్రమలో ఈ ఆర్టిస్ట్ ఎవరో తెలియని ప్రేక్షకుడు ఉండడు. బుల్లితెర యాంకర్‌గా కెరీర్ ప్రారంభించిన ఈమె క్యారెక్ట‌ర్ ఆర్టిస్ట్‌గా తెలుగు తెర‌కు ప‌రిచ‌య‌మై ఎన్నో చిత్రాల్లో నటించి మెప్పుపొందింది. పెద్దా, చిన్నా, యూత్ అనే తేడాలేకుండా తన అందం, అభినయంతో కట్టిపడేయడం సురేఖ స్పెషాలిటీ. కామెడీ పాత్రలకు కేరాఫ్ అడ్రస్‌గా నిలుస్తూ వెండితెరపై హంగామా చేసిన సురేఖ.. ఈ మధ్యకాలంలో సినిమాలకు కాస్త దూరమై సోషల్ మీడియాలో యమ యాక్టివ్‌గా ఉంటోంది. Also Read: తన కూతురు సుప్రితతో కలిసి డాన్సులేస్తూ రచ్చ రచ్చ చేస్తోంది. దీంతో సురేఖ సోషల్ మీడియా ఖాతాలకు ఫుల్ డిమాండ్ ఏర్పడి భారీగా ఫాలోవర్స్ పెరిగిపోతున్నారు. వయసు పెరుగుతున్నా వన్నెతగ్గని గ్లామర్‌తో సురేఖ, ఇప్పుడిప్పుడే షైన్ అవుతూ ఫ్యూచర్ స్టార్ అయ్యే లక్షణాలతో తెగ హంగామా చేస్తున్నారు. వీరిద్దరి స్టెప్పులతో సోషల్ మీడియా హోరెత్తిపోవడం కామన్ అయింది. అయితే తన కూతురు పట్ల ఎంతో ప్రేమగా ఉండే సురేఖా వాణి.. తాజాగా సుప్రిత పుట్టినరోజు సందర్భంగా సర్‌ప్రైజ్ చేసింది. ఈ మేరకు ఆమెపై ఉన్న ప్రేమను తెలుపుతూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది. కూతురు సుప్రిత కోసం తన రూమ్ స్పెషల్‌గా అలంకరించి.. కళ్లు మూసి ఆ రూమ్ వద్దకు తీసుకెళ్లి ఒక్కసారిగా చూపించింది. అయితే అక్కడున్న చిన్న కుక్కు పిల్లను చూసి సుప్రిత ఆనందానికి అవధుల్లేకుండా పోయాయి. ఈ వీడియోని పోస్ట్ చేస్తూ ''నిన్నే పేమిస్తున్నా.. నువ్వే నా బలం, బలహీనత.. మీ డాడీ అక్కడి నుంచి చూస్తుంటాడు.. నీ వెంటే ఉంటాడు. గాడ్ బ్లెస్ యూ సుప్రిత లవ్లీ గాడు.. ఐ లవ్ యూ'' అంటూ ఎమోషనల్ కామెంట్స్ చేసింది . తన భర్త చనిపోయిన తరువాత ఆ బాధను దిగమింగుతూనే కూతురుతో సరదాగా గడుపుతోంది సురేఖ. కాకపోతే హాట్‌నెస్ విషయంలో వెనక్కితగ్గకుండా లుంగీ కట్టి డాన్సులతో ఇరగదీస్తోంది. ఈ క్రమంలో సురేఖ చేసే ఈ హంగామా అంతా సుప్రిత సినీ ఎంట్రీ కోసమే అనే టాక్ బయటకొచ్చింది. దీనిపై స్పందించిన సురేఖావాణి.. అదంతా తన కూతురు ఇష్టమే అని, ఇష్టంతో కెమెరా ముందుకొస్తే ఖచ్చితంగా ప్రోత్సహిస్తానని చెప్పింది.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DKG81q

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....