Saturday, 8 August 2020

వీడు తేడా గాడు అని ఊర్లో ఘోరంగా అవమానించారు.. జబర్దస్త్ పవన్ ఆవేదన

నవ్వులతో ప్రేక్షకుల పొట్టచెక్కలు చేసే కమెడియన్స్.. పైకి నవ్వుతూ నవ్విస్తూ ఉన్నా ఆ నవ్వుల వెనుక ఎన్నో హేళనలు, బాధలు, కష్టాలు దాగి ఉన్నాయి. జబర్దస్త్‌లో కనిపించే కమెడియన్స్‌, టీం లీడర్స్‌ ఒక్కొక్కరదీ ఒక్కో వ్యధ. సుడిగాలి సుధీర్ లాంటి స్టార్ కమెడియన్ల బతుకులు కూడా ఒకప్పుడు రూపాయి పచ్చడి పేకెట్, పెరుగు పేకెట్‌తో కడుపునింపుకున్న జీవితాలే. సుధీర్, హైపర్ ఆది, షకలక శంకర్, చంద్ర, ధనరాజ్, రచ్చ రవి, గెటప్ శీను, ఆనంద్, ముక్కు అవినాష్, ఇలా చెప్పుకుంటూ పోతే జబర్దస్త్ కమెడియన్స్ ఒక్కొక్కరి జీవితం వెనుక ఒక్కోవ్యధ ఉంది. అయితే జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లు వేసే వారు ఆకలి కష్టాలతో పాటు హేళనకు గురైన సందర్భాలు అనేకం. వినోదిని, శాంతి స్వరూప్, పింకీ తదితరులు లేడీ గెటప్‌లు వేయడం ద్వారా వీళ్లు తేడా అనే మచ్చను మోస్తున్నారు. పింకీ అయితే పూర్తిగా ట్రాన్స్ జెండర్‌గా మారింది. అయితే జబర్దస్త్‌లో లేడీ గెటప్‌లతో పాపులర్ అయిన పావని అలియాస్ పవన్ రాథోడ్ తాను లేడీ గెటప్‌లు వేయడం ద్వారా ఎలాంటి హేళనలను ఎదుర్కొన్నాడో తెలియజేశాడు. ‘మేం నలుగురం అన్నదమ్ములం.. ముగ్గురు అక్కలు.. మా ఫ్యామిలీ చాలా పెద్దది. సినిమా ఇండస్ట్రీ అంటే ఏమిటో కూడా తెలియదు మా ఫ్యామిలీకి. అమ్మనాన్న పొలం పనులు చేసుకుంటూ మహారాష్ట్ర వెళ్లారు. నేను లేడీ గెటప్‌లు వేయడంతో ఏనాడూ కూడా మా ఫ్యామిలీ నుంచి ఎందుకు ఇలా చేస్తున్నావ్ అని అడగలేదు కాని.. మా పెద్దక్క వాళ్ల పిల్లలు ఇంజనీరింగ్ చదువుతుండటం వల్ల నా గురించి జనం రకరకాలు మాట్లాడుకుంటున్నారని అక్కతో చెప్పారట. అక్క అప్పుడు బాధపడుతూ.. లేడీ గెటప్‌లు వేస్తే సొసైటీలో జనం రకరకాలు మాట్లాడుకుంటారని అని చెప్పింది. అప్పుడు మా అమ్మ.. ఎవరో ఏదో అనుకుంటారారని వాడి జీవితాన్ని నాశనం చేసుకోలేడు కదా.. వాడు ఏంటో మనకు తెలుసు. బయట వాళ్ల సంగతి మనకి ఎందుకు అంటూ మా అమ్మ చెప్పడంతో నాకు మరింత ధైర్యం వచ్చింది. అప్పటి నుంచి లేడీ గెటప్ అంటే వెనకడుగు వేయలేదు. మా తాండాలో జనాలు అయితే నన్ను ఘోరంగా అవమానించారు. వాళ్ల అన్న మాటలకు చాలా బాధ పడ్డాను. అప్పటి వరకూ నాతో తిరిగిన వాళ్లే.. సడెన్‌గా వీడు తేడా గాడు అని నన్ను విచిత్రంగా చూసేవాళ్లు. లేడీ గెటప్ వేస్తున్నాను అంటే.. వీడు ఎందుకూ పనికి రాడు అనే నిర్ణయానికి వచ్చేసి నానా మాటలు అనేవారు. మా ఊర్లో ఫ్రెండ్స్ కూడా నన్ను చాలా హేళన చేశారు. అయితే మా బాబాయ్ వాళ్ల కూతురు సుశీల.. పవన్ ఊర్లోవాళ్లు అలాగే మాట్లాడతారు. నువ్వు అవేం పట్టించుకోకు. నీ టార్గెట్ ఏంటో నీకు తెలుసు కాబట్టి నువ్ నీ గోల్ రీచ్ కావడానికే ఆలోచించు అని ధైర్యం చెప్పింది. ఆ తరవాత నేను ఊరు వెళ్ళడం కూడా మానేశా. జబర్దస్త్ స్టార్ట్ అయిన తరువాత ఓ రెండు మూడు సార్లు మాత్రమే మా ఊరు వెళ్లా.. అది కూడా తప్పనిసరి పరిస్థితుల్లో వెళ్లాల్సి వచ్చింది. మా ఊరి వాళ్ల మీద కోపంతో నేను వాళ్ల ముందుకు వెళ్లడం మానేయలేదు. నేను ఏదోటి సాధించిన తరువాతే వెళ్లాలని అనుకున్నాడు. ఆరోజుల్లో నేను మా ఊరి వాళ్ల మాటలకు ఏడ్చాను.. బాధపడ్డాను.. వీళ్ల ముందు తల ఎత్తుకుని ఎలా తిరగాలి అని కుమిలిపోయా.. కాని ఇప్పుడు ఏ ఊరు వాళ్లు అయితే నన్ను అవమానించారో వాళ్లే నన్ను ఒక్కసారి మన ఊరికి రా.. ఊర్లో వినాయక చవితి, బతుకమ్మ పండగ చేస్తున్నాం.. నువ్వు తప్పకుండా రావాలని పిలుస్తున్నారు.. షూటింగ్‌లు ఉండటం వల్ల వెళ్లలేకపోతున్నా కాని.. వాళ్లు పిలవడం నాకు చాలా ఆనందంగా గర్వంగా అనిపిస్తుంది’ అంటూ చెప్పుకొచ్చారు . అన్నట్టు పవన్ ఇప్పుడు జీ తెలుగులో ప్రసారం అవుతున్న ‘అదిరింది’ కామెడీ షోలో లేడీ గెటప్‌లతో అలరిస్తున్నాడు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/2DMwWtg

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....