Tuesday, 4 August 2020

చమ్మక్ చంద్ర అవయవ దానం.. ఎవరికీ తెలియని విషయాలు చెప్పిన జబర్దస్త్ సత్తిపండు

జబర్దస్త్ కామెడీ కమెడియన్ చమ్మక్ చంద్ర.. ప్రస్తుతం జీ తెలుగు అదిరించి కామెడీ షోలో చేస్తున్నారు కాని.. ఆయన పాపులర్ అయ్యింది మాత్రం జబర్దస్త్ కామెడీ షోతోనే. ప్రస్తుతం సినిమాలతోనూ బిజీగా ఉన్న గ్రేట్ నెస్‌ గురించి ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు . చానాళ్లు చమ్మక్ చంద్ర టీంలో కీలక సభ్యుడుగా ఉన్న సత్తిపండు.. ఇటీవలే టీం లీడర్ అయ్యారు. తాను ఈ స్థాయికి రావడానికి కారణం చమ్మక్ చంద్ర అంటూ ప్రశంసలు కురిపించారు. Read Also: స్కిట్స్‌లలో ఎప్పుడూ ఎవర్నో ఒకర్ని కొడుతూ తిడుతూ చాలా సీరియస్‌గా కనిపించే చమ్మక్ చంద్ర రియల్ లైఫ్‌లో చాలా చాలా మంచి వ్యక్తి అంటున్నారు సత్తి పండు. ఆయన మాట్లాడుతూ.. ‘చమ్మక్ చంద్ర బాగా కష్టపడి పైకి వచ్చాడు.. 18 ఏళ్లు పాటు కసితో ట్రై చేసి ఇప్పుడు ఆ స్థాయిలో ఉన్నారు. ఆయనతో పోల్చుకుంటే నేను జబర్దస్త్‌లోకి ఈజీగానే వచ్చాను. ఆయన ఎవర్నీ నొప్పించరు.. ఆయన జడ్జీమెంట్ కరెక్ట్‌గా ఉంటుంది. ఏది ఏంటి అనేది చంద్రకు బాగా తెలుసు. బిహేవియర్ విషయంలో కూడా చాలా మెచ్యూర్డ్‌గా ఉంటారు. ఆయన జడ్జిమెంట్ విషయంలో చాలా క్లియర్‌గా మొహమాటం లేకుండా ఉంటుంది. ఎవర్నీ నొప్పించకుండా ఒప్పించి జడ్జిమెంట్ ఇస్తారు. అలాగే తోటి వారికి సాయం చేయాలనే మంచి హ్యూమన్ బీయింగ్ ఆయనది. చాలామందికి సాయం చేశారు.. అంతేకాదు చంద్ర అవయవ దానం చేశారు.. ఆ కార్డ్‌ని నాకు మాత్రమే చూపించారు. మానవత్వం లేకుండా ఇలాంటివి చేయలేరు. ఆర్టిస్ట్‌గా ఆయనలో ఉన్న అన్ని కోణాలను చూపిస్తారు కాని.. రీల్ లైఫ్ వేరు రియల్ లైఫ్ వేరు. కొత్తగా వచ్చే వాళ్లని బాగానే ప్రోత్సహిస్తారు.. వేషం లేకపోతే లేదని వెంటనే చెప్పేస్తారు తప్ప.. బాధపట్టేలా మాట్లాడరు’ అంటూ చెప్పుకొచ్చారు జబర్దస్త్ కమెడియన్ సత్తిపండు. Read Also:


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3fvKMxk

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....