Saturday, 1 August 2020

రెచ్చిపోయిన 'చిన్నారి పెళ్లి కూతురు' యాక్టర్.. యంగ్ హీరోయిన్‌తో రొమాన్స్.. వీడియో వైరల్

రామ్ చరణ్‌తో 'చిరుత' సినిమాలో రొమాన్స్ చేసి తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకున్న హీరోయిన్ నేహా శర్మతో రొమాంటిక్ వీడియోలో కనిపించి పిచ్చెక్కించాడు '' ఫేమ్ (శివ). ఇద్దరూ కలిసి ఓ పాట కోసం జోడీ కట్టి రక్తికట్టించారు. దీంతో ఈ సాంగ్ సోషల్ మీడియా సెన్సేషన్‌గా మారి రికార్డు స్థాయిలో వ్యూస్ రాబడుతోంది. ప్రస్తుతం ఈ సాంగ్ యూ ట్యూబ్ ట్రెండింగ్ లిస్టులో 10వ స్థానంలో ఉంది. ‘దిల్‌ కో కరార్ ఆయా‌’ అంటూ సాగిపోతున్న ఈ వీడియో సాంగ్‌లో హీరోయిన్ అందాలు, ఆమెతో సిద్దార్ధ్ శుక్లా చేసిన రొమాన్స్ తాలూకు సీన్స్ హైలైట్ అవుతున్నాయి. దీంతో ఈ పాటకు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభిస్తోంది. శుక్రవారం రోజు విడుదలైన ఈ సాంగ్ కేవలం 9 గంటల్లోనే 25 లక్షల వ్యూస్ రాబట్టడం విశేషం. నేహా కక్కర్, యస్సార్ దేశాయ్ పాడిన ఈ పాటకు రజత్ నాగ్‌పల్ సంగీతం అందించాడు. Also Read: అటు సంగీత ప్రియులను, ఇటు రొమాంటిక్ ప్రియులను మంత్రముగ్దులను చేస్తున్న ఈ పాటను సిద్దార్థ్ శుక్లా తన ట్విట్టర్ ఖాతా ద్వారా పంచుకుంటూ ఆనందం వ్యక్తం చేశాడు. ''మీరంతా ఈ సాంగ్ ఇష్టపడతారని ఆశిస్తున్నాను. ఈ పాటపై మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి'' అంటూ ఈ పాటను షేర్ చేశాడు. దీంతో పెద్ద ఎత్తున రియాక్ట్ అవుతున్న నెటిజన్స్.. ''ఈ పాట చూస్తుంటే కళ్ళు తిప్పుకోలేక పోతున్నాం, రొమాంటిక్ సీన్స్ అదుర్స్, సూపర్ సాంగ్'' అంటూ కామెంట్స్ పోస్ట్ చేస్తున్నారు.


from Telugu Cinema News | తెలుగు సినిమా న్యూస్ | Latest Telugu Cinema News in Telugu https://ift.tt/3k4Ekkn

No comments:

Post a Comment

'Economically, nobody is winning this war'

'Markets never fully lose hope. But an important shift could come if the Strait remains closed -- moving from high prices to no prices....